ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు జే మహేంద్రన్(79) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ(2 ఏప్రిల్ 2019) ఉదయం చనిపోయినట్లు మహేంద్రన్ తనయుడు, దర్శకుడు జాన్ మహేంద్రన్ వెల్లడించారు.
తమిళంలో అనేక హిట్ చిత్రాలని తెరకెక్కించారు మహేంద్రన్. ముల్లుమ్ మలరుమ్, జానీ, నెంజతై కిల్లాడే మహేంద్రన్‌కి ఎంతగానో పేరు తెచ్చిపెట్టాయి. నటుడిగాను పలు చిత్రాలలో నటించిన ఆయన రీసెంట్‌గా విజయ్ సేతుపతి సీతాకాతి, రజనీకాంత్ పేటా , బ్యూమ్రాంగ్ వంటి చిత్రాలలో కనిపించారు. దర్శకుడు కాకముందు మహేంద్రన్ స్క్రీన్ ప్లే రైటర్‌గా పనిచేశారు.
2018లో ఆయన లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు కూడా అందుకున్నారు. ఆయన మరణంతో తమిళ సినీ పరిశ్రమ షాక్‌కి గురరైంది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని పలువురు ప్రముఖులు ప్రార్ధిస్తున్నారు. కాగా ఉదయం 10గంటల నుండి ప్రజల సందర్శనార్థం పార్థీవదేహం ఉంచనున్నట్లు చెప్పారు. సాయంత్రం 5గంటలకు ఆయన అంత్యక్రియలు చేయనున్నారు.
DIRECTOR MAHENDRAN PASSED AWAY THIS MORNING. pic.twitter.com/usCPXX7Qsr
— Dir.JohnMahendran (@johnroshan) 2 April 2019