Director Kiran Kumar : టాలీవుడ్ లో విషాదం.. త్వరలో సినిమా రిలీజ్.. అంతలోనే దర్శకుడు మృతి..
టాలీవుడ్ లో విషాదం నెలకొంది. దర్శకుడు కిరణ్ కుమార్ అలియాస్ కేకే మరణించారు. (Director Kiran Kumar)
Director Kiran Kumar
Director Kiran Kumar : టాలీవుడ్ లో విషాదం నెలకొంది. దర్శకుడు కిరణ్ కుమార్ అలియాస్ కేకే మరణించారు. దర్శకత్వ శాఖలో ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్న కేకే మణిరత్నం వద్ద కూడా సహాయ దర్శకుడిగా పని చేసాడు. నాగార్జున కేడి సినిమాతో దర్శకుడిగా మారాడు కేకే. ఆ తర్వాత మళ్ళీ చాన్నాళ్లు గ్యాప్ తీసుకొని ఇటివలే KJQ అనే సినిమాని ప్రకటించారు.(Director Kiran Kumar)
KJQ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇప్పటికే టీజర్ కూడా రిలీజ్ చేసారు. 2026 మొదట్లోనే ఈ సినిమా రిలీజ్ కి ప్లాన్ చేసారు. కానీ అంతలోనే దర్శకుడు కేకే మరణించాడు. నేడు ఉదయం కేకే మరణించినట్టు సమాచారం. దీంతో మూవీ యూనిట్, పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. అయితే కేకే ఎలా మరణించాడు, ఆయన మరణానికి కారణాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.
Also Read : Pawan Kalyan : బాబాయ్ కోసం అబ్బాయి త్యాగం.. పవన్ ఫ్యాన్స్ గెట్ రెడీ..
అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కేకే దగ్గర కేడి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. ఈ విషయం కేకే గతంలో ఓ ప్రెస్ మీట్ లో తెలిపాడు.
