Akhanda 3 : బాలయ్యతో మరో సినిమా.. అఖండ 3 పై బోయపాటి అప్డేట్.. ఎప్పుడంటే..?

బోయపాటి అఖండ 2 సక్సెస్ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో అఖండ 3 సినిమా గురించి ప్రస్తావించారు. (Akhanda 3)

Akhanda 3 : బాలయ్యతో మరో సినిమా.. అఖండ 3 పై బోయపాటి అప్డేట్.. ఎప్పుడంటే..?

akhanda 3

Updated On : December 17, 2025 / 2:01 PM IST

Akhanda 3 : బాలకృష్ణ – బోయపాటి కాంబో అంటేనే ఫ్యాన్స్ తో పాటు సినిమా లవర్స్ కూడా ఎదురుచూస్తారు. రీసెంట్ గా వచ్చిన అఖండ 2 తో కలిపి నాలుగు సార్లు ఈ ఇద్దరూ హిట్ కొట్టారు. అఖండ 2 హైప్ మీద ఉన్నప్పుడు అనుకున్న డేట్ వాయిదా పడి ఓపెనింగ్స్ తగ్గాయి కానీ లేకపోతే ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చేవి. అయినా అఖండ 2 సినిమాకు మంచి టాక్ వచ్చింది.(Akhanda 3)

గతంలోనే అఖండ 2 ప్రమోషన్స్ లో అఖండ సిరీస్ లాగా ఓ అయిదారు సినిమాలు చేస్తాం అని చెప్పారు. అఖండ 2 సినిమా చివర్లో పార్ట్ 3 కి కూడా లీడ్ ఇచ్చారు. తాజాగా బోయపాటి అఖండ 2 సక్సెస్ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో అఖండ 3 సినిమా గురించి ప్రస్తావించారు.

Also Read : Director Kiran Kumar : టాలీవుడ్ లో విషాదం.. త్వరలో సినిమా రిలీజ్.. అంతలోనే దర్శకుడు మృతి..

బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. అవెంజర్స్‌ స్థాయి లో స్కోప్‌ ఉన్న సినిమా అఖండ. అవెంజర్స్‌ అనేవి రచయితలు పుట్టించిన సూపర్‌ హీరోలు. మనదగ్గర అలాంటి సూపర్‌ హీరోలు పురాణాల్లో చాలా మంది నిజంగానే ఉన్నారు. మన చరిత్ర నుంచే ఎన్ని కథలైనా, ఎంత మంది సూపర్‌ హీరోలనైనా తీసుకురావొచ్చు. కానీ మనకు సంకల్పం, ఓపిక ఉండాలి. ప్రేక్షకులు చూస్తున్నారు కదా అని వెంటవెంటనే సీక్వెల్స్‌ తీయడం కరెక్ట్ కాదు. రెండు మూడు సినిమాల గ్యాప్‌ తీసుకుని మళ్లీ చేయాలి. నేను కూడా వేరే సినిమాలు తీసాక మళ్ళీ అఖండ 3 గురించి ఆలోచిస్తాను. అఖండ 2 క్లైమాక్స్‌లో శంబాలా తలుపులు తెరచుకోవడాన్ని చూపించాం. అక్కడి నుంచే అఖండ 3 మొదలవుతుంది అని తెలిపారు.

దీంతో అఖండ 3 సినిమా ఉంటుందని, బోయపాటి ఓ రెండు సినిమాలు చేసిన తర్వాత మళ్ళీ బాలయ్యతో అఖండ 3 తీస్తారని తెలుస్తుంది.

Also Read : Pawan Kalyan : బాబాయ్ కోసం అబ్బాయి త్యాగం.. పవన్ ఫ్యాన్స్ గెట్ రెడీ..