Pathaan: మోదీ వ్యాఖ్యల ఎఫెక్ట్? పఠాన్ సినిమాపై నిరసన విరమించుకున్న వీహెచ్పీ
పఠాన్ సినిమాలోని ‘బేషరం రంగ్’ పాట విడుదలతో కాంట్రవర్సీ ప్రారంభమైంది. ఈ పాటలో నటి దీపిక పదుకోన్ కాషాయం రంగు బట్టలు వేసుకోవడంపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాజకీయ నేతలు సైతం పెద్ద ఎత్తున దీనిపై స్పందించారు. ఈ సినిమాను తమ రాష్ట్రంలో విడుదల అవ్వడం కూడా కష్టమేనని మధ్య ప్రదేశ్ హోంమంత్రి వ్యాఖ్యానించారు
- tony bekkal
- Published On : January 24, 2023 / 06:06 PM IST
VHP withdraws protest against Shah Rukh Khan’s ‘Pathaan’
Pathaan: కొద్ది రోజులుగా పఠాన్ సినిమాకు బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్న విశ్వహిందూ పరిషత్.. ఉన్నట్టుండి నిరసన విరమించుకుంటున్నట్లు ప్రకటించింది. ఏమైతేనేమి పఠాన్ సినిమా విడుదలకు ఒక్కరోజు ముందు ఈ నిరసన విరమించుకోవడం గమనార్హం. అయితే దీనికి గల కారణాలను వీహెచ్పీ వెల్లడించింది. తాము చేసిన మార్పులను అంగీకరించడం వల్లే నిరసన విరమిస్తున్నట్లు గుజరాత్ వీహెచ్పీ సెక్రెటరీ అశోక్ రావల్ మంగళవారం చెప్పారు. అయితే అనవసరపు రాద్దాంతం అవసరం లేదని, ముస్లింలకు దగ్గరవ్వాలంటూ ఈ మధ్యే ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన దీనికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
James Cameron : ఆ రికార్డు సాధించిన డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ఒక్కడే..
పఠాన్ సినిమాలోని ‘బేషరం రంగ్’ పాట విడుదలతో కాంట్రవర్సీ ప్రారంభమైంది. ఈ పాటలో నటి దీపిక పదుకోన్ కాషాయం రంగు బట్టలు వేసుకోవడంపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాజకీయ నేతలు సైతం పెద్ద ఎత్తున దీనిపై స్పందించారు. ఈ సినిమాను తమ రాష్ట్రంలో విడుదల అవ్వడం కూడా కష్టమేనని మధ్య ప్రదేశ్ హోంమంత్రి వ్యాఖ్యానించారు. అనేక మంది బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మార్పులు సూచించారు. అయితే దీనిపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (సీబీఎఫ్సీ) స్పందించి తగిన చర్యలు తీసుకున్నట్లు సమాచారం. సుమారు 40 నుంచి 45 వరకు మార్పులు జరిగినట్లు తెలుస్తోంది.
Chiranjeevi : పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై నో కామెంట్స్ అంటున్న చిరంజీవి..
