James Cameron : ఆ రికార్డు సాధించిన డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ఒక్కడే..

ఇటీవల డిసెంబర్ లో జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన అవతార్ 2 సినిమా కూడా భారీ విజయం సాధించింది. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని దాటింది. దాదాపు...............

James Cameron : ఆ రికార్డు సాధించిన డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ఒక్కడే..

Director James Cameron creates a new record worldwide

Updated On : January 24, 2023 / 3:44 PM IST

James Cameron :  టైటానిక్, అవతార్ సినిమాలతోనే తానేంటో ప్రపంచానికి చాటి చెప్పి వరల్డ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకడిగా నిలిచాడు జేమ్స్ కామెరూన్. ఇటీవల డిసెంబర్ లో అవతార్ 2 సినిమాతో వచ్చి మరోసారి తన సత్తాని చాటాడు. జేమ్స్ కామెరూన్ తీసిన ప్రతి సినిమా ఒక విజువల్ వండర్ మాత్రమే కాదు భారీ విజయం కూడా సాధించాయి. ఆయన హాలీవుడ్ లో తీసే సినిమాలు ప్రపంచమంతటా ప్రేక్షకులని మెప్పిస్తున్నాయి. ఎన్ని ఏళ్ళు అయినా ఆయన సినిమాలకి ఇంకా ఆదరణ దక్కుతుంది.

ఇటీవల డిసెంబర్ లో జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన అవతార్ 2 సినిమా కూడా భారీ విజయం సాధించింది. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని దాటింది. దాదాపు 16 వేల కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసింది. ఇంకా కలెక్ట్ చేస్తుంది కూడా. దీంతో ఈ కలెక్షన్స్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2 బిలియన్ డాలర్స్ సాధించిన అతి తక్కువ సినిమాల్లో అవతార్ 2 ఒకటి నిలిచింది. ఈ రికార్డుతో దర్శకుడు జేమ్స్ కామెరూన్ మరో రికార్డ్ కూడా సాధించాడు.

Balakrishna : ఈ ట్వీట్ తో బాలయ్యకి కౌంటర్ ఇచ్చిన అక్కినేని వారసులు??

ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ డాలర్స్ కలెక్షన్స్ దాటిన సినిమాలు ఆరు మాత్రమే కాగా అందులో మూడు సినిమాలు జేమ్స్ కామెరూన్ వి కావడం విశేషం. జేమ్స్ కామెరూన్ డైరెక్ట్ చేసిన టైటానిక్, అవతార్, అవతార్ 2 సినిమాలు 2 బిలియన్ డాలర్స్ పైగా కలెక్ట్ చేశాయి. దీంతో అత్యధిక 2 బిలియన్ డాలర్లు కలెక్ట్ చేసిన సినిమాల దర్శకుడిగా జేమ్స్ కామెరూన్ మరో రికార్డ్ సృష్టించి మరోసారి వరల్డ్ టాప్ డైరెక్టర్ అని సత్తా చాటాడు. త్వరలో అవతార్ కి మరిన్ని సీక్వెల్ సినిమాలతో వస్తాను అని ఇప్పటికే ప్రకటించాడు. ఇక తన అవతార్ 2 సినిమాతో మరోసారి ఆస్కార్ అవార్డుల వేటలో ఉన్నాడు జేమ్స్ కామెరూన్.