Vicky Kaushal – Katrina Kaif : కత్రినాతో గొడవ వస్తే.. విక్కీ కౌశల్ చేసే మొదటి పని ఏంటో తెలుసా..?
తాజాగా ఒక ఇంటర్వ్యూలో విక్కీ కౌశల్, కత్రినాతో తన బంధం గురించి అభిమానులకు తెలియజేశాడు. ఇద్దరి మధ్య గొడవలు వస్తే.. వాటిని ఎలా పరిష్కరించుకుంటారో అనేది వెల్లడించాడు.
- gum 95921
- Published On : September 19, 2023 / 07:49 PM IST
Vicky Kaushal about his relationship with Katrina Kaif
Vicky Kaushal – Katrina Kaif : బాలీవుడ్ హీరోహీరోయిన్లు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్.. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. 2021లో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. ప్రస్తుతం ఇద్దరు తమ తమ సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఇది ఇలా ఉంటే, తాజాగా విక్కీ కౌశల్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో విక్కీ, కత్రినాతో తన బంధం గురించి అభిమానులకు తెలియజేశాడు. ఇద్దరి మధ్య గొడవలు వస్తే.. వాటిని ఎలా పరిష్కరించుకుంటారో అనేది తెలియజేశాడు.
Akkineni Nageswara Rao : ఏఎన్నార్ 100వ పుట్టినరోజు.. అక్కినేని విగ్రహావిష్కరణ చేస్తున్న ఫ్యామిలీ..
ఇద్దరి మధ్య గొడవ వచ్చిన సమయంలో విక్కీనే ముందుగా సారీ చేబుతాడట. తప్పు తనది కాకపోయినా ముందుగా తానే క్షమాపణ చెప్పి ఆ గొడవని అక్కడితో ఎండ్ చేయడానికి ఇష్టపడతాడట. ఒక బంధంలో ఎవరైనా ఎందుకు గొడవ కావాలని అనుకుంటారు. అందుకనే దానిని ఎండ్ చేయడానికి చూడడం బెటర్ అంటూ కపుల్స్ కి సలహా ఇచ్చాడు. మరి విక్కీ ఇచ్చిన సలహా మీకు కూడా ఉపయోగపడుతుందేమో వాడేసుకోండి.
Bollywood : బాలీవుడ్ స్టార్స్ అంతా ఒకటే పోస్ట్.. ‘FARREY’ అంటే ఏంటి..?
ఇక ఈ ఇద్దరి సినిమాల విషయానికి వస్తే.. విక్కీ కౌశల్ ప్రస్తుతం ‘ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’, ‘సామ్ బహుదూర్’ సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకొని పోస్టు ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అలాగే షారుఖ్ ఖాన్ ‘డంకీ’ సినిమాలో ఒక ముఖ్య చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక కత్రినా కైఫ్.. సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ (Tiger 3) సినిమాలో నటిస్తుంది. అలాగే విజయ్ సేతుపతితో కలిసి ‘మెర్రీ క్రిస్మస్’ అనే హారర్ మూవీ చేస్తుంది. ఈ మూవీ హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతుంది.
