Bollywood : బాలీవుడ్ స్టార్స్ అంతా ఒకటే పోస్ట్.. ‘FARREY’ అంటే ఏంటి..?
బాలీవుడ్ స్టార్స్ అంతా.. తాజాగా ఒక పోస్ట్ వేశారు. కత్రినా కైఫ్, కియారా అద్వానీ, వరుణ్ ధావన్, మనీష్ మల్హోత్రా..

Katrina Kaif Kiara Advani Varun Dhawan Manish Malhotra viral post in instagram
Bollywood : బాలీవుడ్ లో ప్రస్తుతం సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్స్ నడుస్తున్నాయి. ఒక పక్క టైగర్ 3తో యాష్ రాజ్ ఫిలిం స్పై యూనివర్స్, సింగం 3తో రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. అంతేకాకుండా మరికొన్ని ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్ లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే, బాలీవుడ్ స్టార్స్ అంతా.. తాజాగా ఒక పోస్ట్ వేశారు. కత్రినా కైఫ్, కియారా అద్వానీ, వరుణ్ ధావన్, మనీష్ మల్హోత్రా.. ఇలా నలుగురు ఒకే రకమైన పోస్టులు వేశారు.
Suresh Babu : చంద్రబాబు అరెస్ట్ పై నిర్మాత సురేష్ బాబు కామెంట్స్.. సినిమా ఇండస్ట్రీ కోసం..
తమ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల్లో ఈ నలుగురు ‘FARREY’ అనే కామెంట్ తో పోస్ట్ వేశారు. అసలు దీని అర్ధం ఏంటి..? ఈ పదాన్ని అందరూ ఎందుకు షేర్ చేశారు అని ఇప్పుడు నెట్టింట చర్చగా మారింది. ఇది ఏమన్నా కొత్త మూవీ ప్రమోషన్..? అనే సందేహం నెలకుంది. కాగా ఇటీవల పలు బ్రాండ్ యాడ్స్ ప్రమోషన్స్ ని కూడా ఇలానే నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ పోస్ట్ కూడా ఏదైనా బ్రాండ్ కి సంబంధించిందా..? అని సందేహం కూడా కలుగుతుంది. మరి ఈ పోస్టు వెనుక ఉన్న అసలు రీజన్ ఏంటో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Sampoornesh Babu : సంపూర్ణేష్ బాబు కొత్త మూవీ అప్డేట్.. ‘మార్టిన్ లూథర్ కింగ్’గా..
View this post on Instagram
ఇక కత్రినా, కియారా సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం ఇద్దరు ఇండియా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. కత్రినా.. సల్మాన్ ఖాన్ టైగర్ 3 (Tiger 3) చిత్రంలో నటిస్తుంది. టైగర్ సిరీస్ లో వచ్చిన ముందు రెండు సినిమాల్లో నటించి అలరించిన కత్రినా.. ఈ మూడో సినిమాలో కూడా కనిపించబోతుంది. ఇక కియారా అద్వానీ ఏమో రామ్ చరణ్ ‘గేమ్ చెంజర్’ (Game Changer) సినిమాలో నటిస్తుంది. శంకర్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాల పై ఇండియా వైడ్ భారీ హైప్ నెలకుంది.