Suresh Babu : చంద్రబాబు అరెస్ట్ పై నిర్మాత సురేష్ బాబు కామెంట్స్.. సినిమా ఇండస్ట్రీ కోసం..

చంద్రబాబు అరెస్ట్ పై స్పదించిన నిర్మాత సురేష్ బాబు. సినిమా ఇండస్ట్రీ కోసం ఎన్టీఆర్ గారు, చెన్నారెడ్డి గారు, చంద్రబాబు నాయుడు..

Suresh Babu : చంద్రబాబు అరెస్ట్ పై నిర్మాత సురేష్ బాబు కామెంట్స్.. సినిమా ఇండస్ట్రీ కోసం..

Producer Suresh Babu comments on Chandrababu Naidu arrest

Updated On : September 19, 2023 / 4:28 PM IST

Suresh Babu : టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ని సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయం పై పొలిటికల్ లీడర్స్, ఐటీ ఉద్యోగులు, కొందరు ప్రముఖులు నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ విషయం పై స్పదించారు. రాఘవేంద్రరావు, అశ్వినీ దత్ మరికొందరు రియాక్ట్ అయ్యారు. అయితే చంద్రబాబు నాయుడు సినిమా ఇండస్ట్రీ కోసం ఎంతో చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి సినిమా పరిశ్రమ వారు ఎందుకు మాట్లాడడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి.

Actress Abhinaya : లవ్, మ్యారేజ్ గురించి నటి అభినయ ఏం చెప్పిందో తెలుసా?

తాజాగా ఈ విషయం గురించి టాలీవుడ్ బడా నిర్మాత సురేష్ బాబుని ప్రశ్నించగా, ఆయన బదులిస్తూ.. “మా నాన్న రామానాయుడు తెలుగుదేశం పార్టీ మెంబెర్, నేను ఆ పార్టీ కోసం పని చేశాను. కానీ రాజకీయం వేరు, సినిమా వేరు. నన్ను వ్యక్తిగతంగా అడిగితే నేను ఏదైనా సమాధానం చెబుతాను. కానీ నేను ఇక్కడ సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తిని. ఇక్కడ నేను ఏది మాట్లాడినా.. అది సినిమా పరిశ్రమ నుంచి అవుతుంది. సినిమా ఇండస్ట్రీ కోసం ఎన్టీఆర్ గారు, చెన్నారెడ్డి గారు కూడా పని చేశారు. చెన్నై నుంచి పరిశ్రమ ఇక్కడికి రావడంలో వీరిద్దరి పాత్ర ఎక్కువ ఉంది. నా వరకు చెన్నారెడ్డి గారు సినిమా ఇండస్ట్రీ కోసం ఎక్కువ పని చేశారు” అంటూ గుర్తుకు చేశారు.

Shruti Haasan : ముంబై ఎయిర్‌పోర్టులో శృతిహాసన్‌ని భయపెట్టిన అభిమాని.. వీడియో వైరల్

అలాగే ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన సమయంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతోమంది లీడర్స్ పాలిటిక్స్ లో ఉన్నారని. ఆ సమయంలో వారితో కలిసి నడిచినప్పటికీ ఎప్పుడూ ఎవరూ పొలిటికల్ స్టేట్‌మెంట్స్ ఇవ్వలేదని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయే సమయంలో కూడా ఎవరూ ఎటువైపు సపోర్ట్ చేయలేదని గుర్తు చేశారు. సినిమా ఇండస్ట్రీని నాన్ రిలీజియస్, నాన్ పొలిటికల్ గా చూడండి అంటూ వెల్లడించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.