×
Ad

Venky 75 Event : వెంకీ మామ 75 సినిమాల సెలబ్రేషన్స్ ప్రోమో చూశారా? ఫుల్ ఈవెంట్ ఎప్పుడు? ఎక్కడ స్ట్రీమింగ్?

వెంకీ మామ 75 సినిమాలు కంప్లీట్ చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలియచేస్తూ 'సైంధవ్‌' నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ ఇటీవల గ్రాండ్ ఈవెంట్ ని నిర్వహించింది.

  • Published On : December 31, 2023 / 09:50 AM IST

Victory Venkatesh 75 Movies Completed Event Venky 75 Promo Released Full Event Streaming Details Here

Venky 75 Event : టాలీవుడ్ విక్టరీ వెంకటేష్(Venkatesh) తన కెరీర్ లో 75 సినిమాలు పూర్తి చేసుకుంటున్నారు. తన 75వ మూవీగా ‘సైంధవ్‌’”(Saindhav) సినిమాని ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. దీంతో వెంకీ మామ 75 సినిమాలు కంప్లీట్ చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలియచేస్తూ సైంధవ్‌ నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ ఇటీవల గ్రాండ్ ఈవెంట్ ని నిర్వహించింది. ఈ ఈవెంట్ కి చిరంజీవి(Chiranjeevi), రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే నాని, శ్రీవిష్ణు, అడివిశేష్, బ్రహ్మానందం, అలీ, నిఖిల్, విశ్వక్ సేన్, అనిల్ రావిపూడి.. ఇలా పలువురు సినీ ప్రముఖులతో పాటు చిత్రయూనిట్ ఈ ఈవెంట్ కి విచ్చేశారు.

అయితే ఈ వెంకీ 75 ఈవెంట్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ యాప్ ఈ విన్ కొనుక్కోవడంతో ఈవెంట్ ని బయట టెలికాస్ట్ చేయలేదు. కేవలం కొంతమంది ఫ్యాన్స్ మధ్యే ఈవెంట్ నిర్వహించారు. తాజాగా ఈ ఈవెంట్ ప్రోమోని రిలీజ్ చేశారు. ప్రోమో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఈ ఈవెంట్లో కామెడీ స్కిట్స్, డ్యాన్సులు, పాటలు, ఎమోషనల్ స్పీచ్ లు, గేమ్స్.. ఇలా అన్ని కలగలిపి ఉన్నాయి. ప్రస్తుతం వెంకీ 75 ఈవెంట్ ప్రోమో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.

Also Read : Star Directors : 2023 సినిమా ఇండస్ట్రీని ఊపేసిన టాప్ 5 డైరెక్టర్స్ వీళ్ళే.. భారీ సినిమాలతో..

ఇక ఫుల్ ఈవెంట్ ఈ విన్ ఓటీటీ యాప్ లో నేడు సాయంత్రం 6 గంటల నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. దీంతో వెంకీ మామ అభిమానులు ఈ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ ని న్యూ ఇయర్ కానుకగా ఫ్రీగానే అందిస్తుంది ఈ విన్. ఇంకెందుకు ఆలస్యం న్యూ ఇయర్ కి వెంకీ మామ్ 75 సినిమాల ఈవెంట్ తో ఎంజాయ్ చేసేయండి..