Aadarsha Kutumbam Twitter Review : ఆదర్శ కుటుంబం ట్విటర్ రివ్యూ.. వెంకీ-త్రివిక్రమ్ కాంబో అదరగొట్టేసిందా!
Aadarsha Kutumbam Twitter Review : విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఆదర్శకుటుంబం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
- Thota Vamshi Kumar
- Published on- October 30, 2026 / 11:10 AM IST
Victory Venkatesh Aadarsha Kutumbam Twitter Review
Aadarsha Kutumbam Twitter Review : విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన తాజా చిత్రం ఆదర్శకుటుంబం. హౌస్ నెంబర్ 47 అనేది ట్యాగ్ లైన్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. శ్రీనిధి శెట్టి కథానాయిక. నారా రోహిత్, నివేదా పేతురాజ్, సత్య, రఘుబాబు, యువిన పార్థవి, ప్రజ్వల కీలక పాత్రలను పోషించారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల నడుమ నేడు (అక్టోబర్ 30న) ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
చాలా చోట్ల ఇప్పటికే షోలు పడ్డాయి. ఈ చిత్రాన్ని వీక్షించిన వారు సోషల్ మీడియా వేదికగా తమ స్పందనను తెలియజేస్తున్నారు. వెంకీ వన్‌మ్యాన్ షో అని అంటున్నారు. తన ట్రేడ్‌మార్క్ కామెడీ టైమింగ్‌తో సన్నివేశాలను నిలబెట్టారని చెబుతున్నారు. ఇక సత్య కామెడీ నవ్వులు పూయించిందట. శ్రీనిధి శెట్టి పాత్రకు సంబంధించిన సన్నివేశాలు కూడా బాగున్నాయని చెబుతున్నారు. త్రివిక్రమ్ సంభాషణలు ఆకట్టుకున్నాయని అంటున్నారు. మొత్తంగా చిత్రానికి మంచి స్పందన వస్తోంది.
