‘అసురన్’ రీమేక్‌లో వెంకటేష్

తమిళ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘అసురన్’ తెలుగు రీమేక్‌లో హీరోగా ‘విక్టరీ వెంకటేష్’.. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి..

  • Publish Date - October 25, 2019 / 05:19 AM IST

తమిళ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘అసురన్’ తెలుగు రీమేక్‌లో హీరోగా ‘విక్టరీ వెంకటేష్’.. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి..

ఇటీవల కాలంలో ‘దృశ్యం’, ‘గోపాల గోపాల’, ‘గురు’ వంటి రీమేక్‌లతో ఆకట్టుకున్న విక్టరీ వెంకటేష్ ఇప్పుడు మరో రీమేక్‌కి రెడీ అయ్యారు. తమిళ స్టార్ హీరో ధనుష్, వెట్రి మారన్ కాంబినేషన్‌లో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘అసురన్’.. దసరా కానుకగా అక్టోబర్ 4న విడుదలై, విజయవంతంగా ప్రదర్శింపబడుతూ.. రీసెంట్‌గా రూ.150 కోట్ల వసూళ్లు సాధించింది.

వి. క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్మించిన ‘అసురన్’ లో ధనుష్.. ద్విపాత్రాభినయం చేశాడు.. అతనికి జోడిగా మంజు వారియర్ నటించింది. ఈ మధ్య కాలంలో కేవలం కథాబలమున్న సినిమాలను మాత్రమే చేస్తున్న వెంకటేష్.. ‘అసురన్’ తెలుగు రీమేక్‌లో నటించబోతున్నారు.

Read Also : నీ థియేటర్‌ల నా బొమ్మ : ఇస్మార్ట్ 100 డేస్

ప్రస్తుతం వెంకీ మామ సినిమాతో బిజీగా ఉన్న వెంకీ, ఇప్పుడు ‘అసురన్’ రీమేక్‌లో నటించనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ బ్యానర్స్‌పై సురేష్ బాబు, కళైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మించనున్నారు. త్వరలో మూవీ టీమ్ ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేయనున్నారు.