Kalki 2898 AD : కల్కి సెట్స్ నుంచి వీడియో లీక్.. నెట్టింట ఫోటోలు వైరల్..

కల్కి సెట్స్ నుంచి వీడియో లీక్ అయ్యింది. దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Video and Photos leak from Prabhas Kalki 2898 AD Movie

Kalki 2898 AD : ప్రభాస్ హీరోగా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో టాలీవుడ్ లో రూపొందుతున్న ఫ్యూచరిస్టిక్ మూవీ ‘కల్కి 2898 AD’. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు. మేలో రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా వర్క్స్ పూర్తి చేసుకుంటుంది.

కాగా ఈ మూవీ మొత్తం మూడు భాగాలుగా రాబోతుందని, ఫస్ట్ పార్ట్ షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యిందని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం సెకండ్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ జరుగుతుందట. ఇది ఇలా ఉంటే, ఈ మూవీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట లీక్ అయ్యింది. ఆ వీడియోలో కల్కి మూవీ సెట్స్ కి సంబంధించిన విజువల్స్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ వీడియోకి చెందిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Also read : Pawan Kalyan : OG మూవీ సెట్స్‌ నుంచి.. పవన్ కొత్త ఫోటో వచ్చేసింది.. నెట్టింట వైరల్

ఇక ఈ మూవీ టీజర్ విషయానికి వస్తే.. అమెరికాలో అత్యధికంగా పాల్గొనే ‘ది సూపర్ బౌల్’ ఈవెంట్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. హాలీవుడ్ బడా మూవీస్ డెడ్ పూల్ 3, జోకర్ 2, గాడ్జిల్లా, డూన్ 2 గ్లింప్స్ అండ్ ట్రైలర్స్ అక్కడే రిలీజ్ చేశారు. ఇప్పుడు కల్కి టీజర్ ని కూడా అక్కడ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. కాగా కల్కి టైటిల్ ని గ్లింప్స్ ని కూడా హాలీవుడ్ మూవీ అప్డేట్స్ రిలీజ్ అయ్యే.. కామిక్ కాన్ ఈవెంట్ లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని ముఖ్య పత్రాలు పోషిస్తున్నారు. వీరితో పాటు రాజమౌళి, రానా, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని, మృణాల్ ఠాకూర్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు