Vijay Antony : సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్న స్టార్ హీరో.. నిరాశలో అభిమానులు..

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమాలకు తన రిటైర్మెంట్ గురించి వ్యాఖ్యలు చేశారు. (Vijay Antony)

  • Published on- June 8, 2026 / 10:33 PM IST

Vijay Antony

Vijay Antony : సంగీత దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టి హీరోగా కూడా వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు విజయ్ ఆంటోనీ. బిచ్చగాడు సినిమాతో తమిళ్ లో స్టార్ హీరో అయితే తెలుగులో కూడా మంచి ఫేమ్, మార్కెట్ తెచ్చుకున్నాడు. అప్పటినుంచి తన ప్రతి సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ ఇక్కడ కూడా ప్రమోషన్స్ చేస్తున్నాడు. తన సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా ప్రతి సినిమాలో ఓ కొత్త కాన్సెప్ట్ ఉంటుంది.

ప్రస్తుతం విజయ్ ఆంటోనీ నటించిన వంద దేవుళ్ళు సినిమా జూన్ 19 న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమాలకు తన రిటైర్మెంట్ గురించి వ్యాఖ్యలు చేశారు.

Also Read : Thaman : దేవిశ్రీ ప్రసాద్ సినిమాకు పనిచేస్తానంటున్న తమన్.. దేవి అన్న అంటూ..

విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. నాకు విలాసవంతంగా బతకాలని లేదు. ఓ రెండు మూడేళ్ళలో నేను సినీ పరిశ్రమని, చెన్నైని పూర్తిగా వదిలేద్దామనుకుంటున్నాను. వీటన్నిటిని వదిలేసి ఓ పల్లెటూరిలో సెటిల్ అవ్వాలి. నాకు సింపుల్ గా బతకడమే ఇష్టం. అందుకే ఓ మారుమూల గ్రామంలో వ్యవసాయ భూమి కొనడానికి చూస్తున్నాను. పొలం కొనుక్కొని అక్కడే సెటిల్ అయిపోతాను అని అన్నారు. దీంతో విజయ్ ఆంటోనీ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నారని తెలియడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

కొన్నాళ్ల క్రితం విజయ్ పెద్ద కూతురు మీరా ఆత్మహత్య చేసుకొని మరణించింది. ఈ విషయం విజయ్ ని మానసికంగా బాగా దెబ్బతీసింది. అప్పట్నుంచి విజయ్ కొంత నిరాశగా ఉండటం, ఫిలాసఫీ ఎక్కువగా మాట్లాడటం అందరూ గమనిస్తున్నారు. ఆ బాధతోనే విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అనుకుంటున్నారు. అందుకే ఒప్పుకున్న సినిమాలు, పాత కమిట్మెంట్లు అన్ని పూర్తి చేసి దూరంగా వెళ్ళిపోతాడని తెలుస్తుంది.

Also Read : Bollywood : టాలీవుడ్ మీద జెలస్ ఫీల్ అవుతున్న బాలీవుడ్..? పెద్ది విషయంలో..