Thaman : దేవిశ్రీ ప్రసాద్ సినిమాకు పనిచేస్తానంటున్న తమన్.. దేవి అన్న అంటూ..
నేడు తమన్ తన మ్యూజికల్ టూర్ కి సంబంధించిన ప్రెస్ మీట్ నిర్వహించగా ఇందులో దేవిశ్రీ ప్రసాద్ గురించి మాట్లాడుతూ.. (Thaman)
Thaman
Thaman : టాలీవుడ్ లో కొన్నాళ్లపాటు దేవిశ్రీప్రసాద్ ఆధిపత్యం సాగితే గత కొన్నాళ్లుగా తమన్ అదరగొడుతున్నాడు. ఒకానొక సమయంలో ఈ ఇద్దరికీ పోటీ, ఇద్దరి మధ్య విబేధాలు అని కూడా వచ్చాయని వార్తలు వచ్చాయి. కానీ అవేమి లేవని పలుమార్లు ఒకరి గురించి ఒకరు మాట్లాడుతూ క్లారిటీ ఇస్తూనే వస్తున్నారు. నేడు తమన్ దేవిశ్రీ ప్రసాద్ పై ఆసక్తికర కామెంట్స్ చేసాడు.
నేడు తమన్ తన మ్యూజికల్ టూర్ కి సంబంధించిన ప్రెస్ మీట్ నిర్వహించగా ఇందులో దేవిశ్రీ ప్రసాద్ గురించి మాట్లాడుతూ.. ఎల్లమ్మ లాంటి సినిమాని దేవిశ్రీ ప్రసాద్ ఒప్పుకున్నందుకు హ్యాట్సాఫ్. నాకు ఆ కథ మొత్తం తెలుసు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఆ సినిమాకు దేవి అన్న ప్రాణం పెడుతున్నాడు. నేను దిల్ రాజు గారితో మాట్లాడినప్పుడు పాటలు చేయాల్సి వస్తే ఆ సినిమాను నేను చేస్తాను అని అడిగాను. నాది, నేనే అంటే సరిపోదు. అందరితో కలిసి పనిచేయాలి. అందుకే దేవిశ్రీ సినిమాకు పనిచేస్తానని అడిగినట్లు తెలిపారు.
Bollywood : టాలీవుడ్ మీద జెలస్ ఫీల్ అవుతున్న బాలీవుడ్..? పెద్ది విషయంలో..
దీంతో మరోసారి తనకు – దేవిశ్రీ మధ్య ఎలాంటి విబేధాలు లేవని క్లారిటీ ఇచ్చాడు. మరి ఎల్లమ్మ సినిమాకు తమన్ వర్క్ చేస్తాడా చూడాలి. అలాగే.. నేను గతంలో బాయ్స్ సినిమాలో హీరోగా చేశాను. మళ్ళీ చేయను. దేవి అన్న ముందు సంగీతం చేసి ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు. ఇకపై నా జీవితం సంగీతానికే అని అన్నారు.
