Vanda Devullu : ‘వంద దేవుళ్లు’ ట్రైలర్ రిలీజ్.. బిచ్చగాడు కాంబో.. మరోసారి అమ్మ ఎమోషన్..
మీరు కూడా వంద దేవుళ్ళు ట్రైలర్ చూసేయండి..(Vanda Devullu)
- Saketh U
- Updated on- June 8, 2026 / 06:57 PM IST
Vanda Devullu
Vanda Devullu : బిచ్చగాడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమా హీరో విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘వంద దేవుళ్లు’. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ పై రామంజనేయులు జవ్వాజి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో విజయ్ ఆంటోనితో పాటు స్వాసిక, అజయ్ ధిషన్, కావ్య అనిల్.. పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్, సాంగ్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ సినిమా జూన్ 19న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కూడా అమ్మ సెంటిమెంట్ మీదే ఉండబోతుంది. ఈ ట్రైలర్‌ను మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసి ఆల్ ది బెస్ట్ తెలిపారు.
Also Read : Ram Charan : అలా చేస్తే ఏ సినిమా అయినా హిట్ అవ్వాల్సిందే… ‘పెద్ది’ సక్సెస్ ఈవెంట్లో చరణ్ కామెంట్స్..
మీరు కూడా వంద దేవుళ్ళు ట్రైలర్ చూసేయండి..
