Vanda Devullu : బిచ్చగాడు దర్శకుడితో విజయ్ ఆంటోని సినిమా.. ‘వంద దేవుళ్లు’ టీజర్ రిలీజ్..

తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు. (Vanda Devullu)

  • Published On : April 4, 2026 / 06:44 PM IST

Vanda Devullu

Vanda Devullu : బిచ్చగాడు లాంటి బ్లాక్ బస్టర్ తరువాత హీరో విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబోలో ‘వంద దేవుళ్లు’ అనే సినిమా రాబోతోంది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ పై రామంజనేయులు జవ్వాజి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో విజయ్ ఆంటోనితో పాటు స్వాసిక, అజయ్ ధిషన్, కావ్య అనిల్.. పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్, సాంగ్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉందని సమాచారం. సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Also Read : Shweta Basu Prasad : కొత్త బంగారు లోకం హీరోయిన్ రీ ఎంట్రీ..? మళ్ళీ అదే కాంబోతో..?

మీరు కూడా వంద దేవుళ్ళు టీజర్ చూసేయండి..