Shweta Basu Prasad : కొత్త బంగారు లోకం హీరోయిన్ రీ ఎంట్రీ..? మళ్ళీ అదే కాంబోతో..?
ఓ సంఘటన తర్వాత శ్వేతా బసు తెలుగు సినిమాలకు దూరమయింది. (Shweta Basu Prasad)
Shweta Basu Prasad
Shweta Basu Prasad : చైల్డ్ ఆర్టిస్ట్ గా హిందీలో కెరీర్ మొదలుపెట్టి తెలుగులో కొత్త బంగారు లోకం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్వేతా బసు ప్రసాద్ మొదటి సినిమాతోనే పెద్ద విజయం సాధించింది. ఆ తర్వాత రైడ్, కలవర్ కింగ్, కాస్కో, ప్రియుడు.. సినిమాలతో మెప్పించింది. కానీ ఓ సంఘటన తర్వాత శ్వేతా బసు తెలుగు సినిమాలకు దూరమయింది.
శ్వేతా బసు ప్రసాద్ చివరగా 2017 లో మిక్చర్ పొట్లం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించగా ఆ తర్వాత హిందీలోనే సినిమాలు, సిరీస్ లు చేసుకుంటూ అక్కడే సెటిల్ అయిపోయింది. టాలీవుడ్ లోకి అసలు రాదు అని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కానీ తాజాగా శ్వేతా బసు ప్రసాద్ తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : Renu Desai : ఇకపై కూడా అరెస్టులు ఆగవు.. మరోసారి వాళ్ళని హెచ్చరించిన రేణు దేశాయ్..
వరుణ్ సందేశ్, శ్వేతా బసుప్రసాద్ జంటగా ఓ ఓటీటీ సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే నిర్మాణ సంస్థ శ్వేతా బసుతో కూడా మాట్లాడి ఒప్పించారట. ఆమె తెలుగు రీ ఎంట్రీ కంఫర్మ్ అయిపోయినట్టే అని తెలుస్తుంది. కొత్త బంగారు లోకం తర్వాత ఇన్నేళ్లకు మళ్ళీ శ్వేతా బసు ప్రసాద్, వరుణ్ సందేశ్ కాంబో వస్తే కచ్చితంగా ఆ సినిమాపై అంచనాలు నెలకొంటాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
