Koffee with Karan : బాలీవుడ్ టాప్ షోలో విజయ్ దేవరకొండ

తాజాగా విజయ్ దేవరకొండ బాలీవుడ్ టాప్ షోలో గెస్ట్ గా వెళ్ళాడు. బాలీవుడ్ అగ్ర దర్శక, నిర్మాత కరణ్ జోహార్ యాంకర్ గా కాఫీ విత్ కరణ్ షో అందరికి తెలిసిందే. ఈ షో బాలీవుడ్ లో............

Vijay Devarakonda :  ప్రస్తుతం విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు. అందుకోసం బాగానే హార్డ్ వర్క్ చేస్తున్నాడు. త్వరలో విజయ్ లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించగా చార్మీ, పూరి, కరణ్ జోహార్ కలిసి నిర్మిస్తున్నారు. దీంతో విజయ్ బాలీవుడ్ లో కూడా సినిమా రిలీజ్ అవ్వకముందే బాగా ఫేమస్ అయ్యాడు. బాలీవుడ్ పార్టీలకు వెళ్తూ, బాలీవుడ్ స్టార్స్ తో ఎంజాయ్ చేస్తున్నాడు.

తాజాగా విజయ్ దేవరకొండ బాలీవుడ్ టాప్ షోలో గెస్ట్ గా వెళ్ళాడు. బాలీవుడ్ అగ్ర దర్శక, నిర్మాత కరణ్ జోహార్ యాంకర్ గా కాఫీ విత్ కరణ్ షో అందరికి తెలిసిందే. ఈ షో బాలీవుడ్ లో బాగా ఫేమస్. ప్రస్తుతం ఈ షో కొత్త సీజన్ ఓటీటీలో టెలికాస్ట్ అవ్వనుంది. ఒకపక్క విజయ్ లైగర్ సినిమా షూటింగ్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి అనుకుంటున్నాడు.

 

Suman : సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరూ హ్యాపీగా లేరు.. బయ్యర్స్ గురించి పట్టించుకోవట్లేదు..

కాఫీ విత్ కరణ్ కొత్త సీజన్ కి మొదటి ఎపిసోడ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ రాబోతున్నాడు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా అయిపోయినట్టు తెలుస్తుంది. తాజాగా ఈ షోలో కాఫీ కాప్స్ మీద విజయ్, కరణ్ సైన్ చేయగా వాటిని ఫోటో తీసి విజయ్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. దీంతో విజయ్ దేవరకొండ కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నాడు అనడంతో విజయ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ ఈ ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుందని సమాచారం.

ట్రెండింగ్ వార్తలు