Kushi : షూటింగ్ పూర్తి.. పుల్ స్వింగ్లో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు.. సెలబ్రేషన్స్ చూశారా
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తున్న చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సమంత (Samantha) కథానాయిక.
- Thota Vamshi Kumar
- Updated on- July 15, 2023 / 05:44 PM IST
Kushi shooting completed
Kushi shooting completed : రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సమంత (Samantha) కథానాయిక. మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదల అయ్యాయి. ‘నా రోజా నువ్వే’ తో పాటు ‘ఆరాధ్య’ అంటూ సాగే పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం అప్డేట్ ఇచ్చింది. షూటింగ్ పూర్తి అయిన సందర్భంగా చిత్ర బృందం కేక్ ను తీసుకురాగా హీరో విజయ్ కట్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను చిత్ర బృందం తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పుల్ స్వింగ్లో జరుగుతున్నట్లు తెలిపింది.
తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ బాషల్లో సెప్టెంబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్, సమంత గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విధంగా రాణించలేకపోయాయి. ఈ సినిమాతో వీరిద్దరు సాలీడ్ హిట్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో హీరోయిన్ సమంత తన ఆరోగ్యంపై మరింత ఫోకస్ చేసేందుకు సినిమాలకు ఒక సంవత్సరం పాటు బ్రేక్ ఇస్తున్నట్లు ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే.
