#VD12 : జెర్సీ డైరెక్టర్‌తో విజయ్ దేవరకొండ సినిమా.. స్పై క్యారెక్టర్ అంటూ అంచనాలు పెట్టేసిన రౌడీ హీరో..
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న #VD12 సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నాయి. చిత్ర ప్రకటన సందర్భంగా మేకర్స్ కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో విజయ్ దేవరకొండ...................
- Saketh U
- Published On : January 13, 2023 / 07:37 PM IST
Vijay Devarakonda next movie update announced
#VD12 : విజయ్ దేవరకొండ నుంచి ఇటీవల వచ్చిన లైగర్ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకోగా అది పరాజయం పాలైంది. దీంతో అప్పట్నుంచి సైలెంట్ గా, మీడియాకి దూరంగా ఉంటున్నాడు. విజయ్, పూరి సినిమా జనగణమన కూడా ఆగిపోవడంతో విజయ్ చేతిలో ఖుషి సినిమా ఒకటే ఉంది. మరి నెక్స్ట్ విజయ్ ఏ సినిమాతో వస్తాడు, అప్డేట్ ఇవ్వడా అని గత నాలుగు నెలలుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు.
తాజాగా విజయ్ దేవరకొండ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. మళ్ళీ రావా, జెర్సీ సినిమాలతో మెప్పించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి హిందీలో కూడా జెర్సీని రీమేక్ చేశాడు. అనంతరం రామ్ చరణ్ తో సినిమా ఉంటుంది అని ప్రకటించారు కూడా. కానీ అనుకోని కారణాలతో ఈ సినిమా ఆగిపోయింది. తాజాగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమాని అనౌన్స్ చేశారు.
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న #VD12 సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నాయి. చిత్ర ప్రకటన సందర్భంగా మేకర్స్ కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో విజయ్ దేవరకొండ పోలీసు దుస్తుల్లో ముఖానికి ముసుగు ధరించి గూఢచారిని తలపిస్తున్నాడు. పోస్టర్ మీద “I don’t know where I belong, to tell you whom I betrayed – Anonymous Spy” అని రాసుండటం గమనార్హం. దీంతో ఇదొక స్పై ఫిల్మ్ అని పోస్టర్ ని బట్టి అర్థమవుతోంది. అలాగే సముద్రతీరంలో యుద్ధ సన్నివేశాన్ని తలపించేలా మంటల్లో దగ్ధమవుతున్న పడవలతో పోస్టర్ ను ఆసక్తి రేకెత్తించేలా రూపొందించారు. దీంతో సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ తోనే అంచనాలు నెలకొల్పాడు విజయ్.
ఇక ఇదే పోస్టర్ ని విజయ్ దేవరకొండ షేర్ చేస్తూ.. నా తదుపరి స్క్రిప్ట్, జట్టు, నా తదుపరి సినిమా. ఇది విన్నప్పుడు నా గుండె కొట్టుకోవడం కొన్ని సార్లు మిస్ అయింది అని సినిమాపై ఇప్పట్నుంచే అంచనాలు పెంచేశాడు. చాలా రోజుల తర్వాత విజయ్ నుంచి అప్డేట్ రావడంతో విజయ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ కి వెళ్లనున్నట్టు సమాచారం. ఇక ప్రస్తుతం విజయ్ హీరోగా సమంత హీరోయిన్ గా ఖుషి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
The Script. The Team. My next.
My heart skipped a few beats when I heard this. #VD12 pic.twitter.com/x7ELlsb6Ub
— Vijay Deverakonda (@TheDeverakonda) January 13, 2023
