Veerasimha Reddy : బాలకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్.. ఒక్కరోజే 54 కోట్ల ఊచకోత కోసిన వీరసింహారెడ్డి..

వీరసింహారెడ్డి సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ని చిత్ర యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. వీరసింహారెడ్డి సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 54 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. బాలకృష్ణ కెరీర్ లోనే ఇది హైయెస్ట్ ఓపెనింగ్స్................

Veerasimha Reddy : బాలకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్.. ఒక్కరోజే 54 కోట్ల ఊచకోత కోసిన వీరసింహారెడ్డి..

Veerasimha Reddy first day collections

Veerasimha Reddy :  బాలకృష్ణ హీరోగా శృతి హాసన్, హనీరోజ్ హీరోయిన్స్ గా నవీన్ చంద్ర, వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా వీరసింహా రెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్స్ లో రిలీజయింది. బాలకృష్ణ గత సూపర్ హిట్ సినిమాలు గుర్తొచ్చేలా మాస్ యాక్షన్ తో ఈ సినిమాని తీశారు.

మొదటి ఆట నుంచి సినిమాపై పాజిటివ్ టాక్ వచ్చింది. బాలయ్య అభిమానులకి ఈ సినిమా పిచ్చపిచ్చగా నచ్చేసింది. మాములు ఆడియన్స్ కి సినిమా పర్వాలేదనిపించినా బాలయ్య ఫ్యాన్స్ కి మాత్రం ఈ సినిమా ఫుల్ మీల్స్. బాలయ్య దగ్గర్నుంచి ఆశించే మాస్ ఫైట్స్, డైలాగ్స్ తో పాటు ట్విస్టులు, సెంటిమెంట్ ఉండటంతో సినిమాకి మరింత ప్లస్ అయింది. రెండు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక థియేటర్స్ లో వీరసింహారెడ్డి సినిమా రిలీజ్ అయింది. మొదటి రోజు అన్ని ఆటలు అన్ని చోట్ల హౌస్ ఫుల్ అయి సినిమాకి కలెక్షన్స్ బాగా తెచ్చిపెట్టాయి.

Waltair Veerayya : వాల్తేరు వీరయ్య ఈ ఓటీటీలోనే వచ్చేది..

వీరసింహారెడ్డి సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ని చిత్ర యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. వీరసింహారెడ్డి సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 54 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. బాలకృష్ణ కెరీర్ లోనే ఇది హైయెస్ట్ ఓపెనింగ్స్. 54 కోట్ల గ్రాస్ కలెక్షన్స్, దాదాపు 28 కోట్ల షేర్ కలెక్షన్స్ తో సరికొత్త రికార్డ్ సృష్టించారు బాలయ్య బాబు. దీంతో బాలయ్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి బాలయ్య తన మార్క్ మాస్ సినిమాతో ఇండస్ట్రీ దగ్గర ఊచకోత కోశారంటున్నారు. సంక్రాంతి హాలిడేస్ కూడా ఉండటంతో ఇదే ఊపు కొనసాగితే బ్రేక్ ఈవెన్ ని వారం రోజుల్లోపే సాధించేయొచ్చు అని టాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.