T20 World Cup 2026 : విజృంభించిన బౌలర్లు.. దక్షిణాఫ్రికా టార్గెట్ 123
టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026)లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా యూఏఈ, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది.
T20 World Cup 2026 SA vs UAE South Africa Target is 123
T20 World Cup 2026 : ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా యూఏఈ, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన యూఏఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. దీంతో దక్షిణాఫ్రికా ముందు 123 పరుగుల లక్ష్యం నిలిచింది.
🚨 Change of Innings 🚨
An excellent effort from South Africa with the ball as UAE finish their innings on 122/6 after 20 overs. 🏏🏟#TheProteas will fancy chasing down this target to complete a clean sweep of the group. 💪🇿🇦#Unbreakable #T20WorldCup pic.twitter.com/zeeG43wGQZ
— Proteas Men (@ProteasMenCSA) February 18, 2026
T20 World Cup 2026 : వర్షం కారణంగా నమీబియాతో మ్యాచ్ రద్దైతే.. పాక్‌కు లాభమా? నష్టమా?
యూఏఈ బ్యాటర్లలో అలీషన్ షరాఫు (45; 38 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. కెప్టెన్ ముహమ్మద్ వసీం (22; 12 బంతుల్లో 4 ఫోర్లు) వేగంగా ఆడాడు. ఆర్యన్ష్ శర్మ (13), ముహమ్మద్ అర్ఫాన్ (11) మినహా మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కార్బిన్ బాష్ మూడు వికెట్లు పడగొట్టాడు. అన్రిచ్ నోర్ట్జే రెండు వికెట్లు తీశాడు.జార్జ్ లిండే ఓ వికెట్ సాధించాడు.
