Pawan Kalyan : విశాఖ తీరంలో ఐఎఫ్ఆర్ వేడుకలు.. సతీమణి అన్నా లెజినోవాతో కలిసి పాల్గొన్న పవన్ కల్యాణ్ .. ఫొటోలు వైరల్
Pawan Kalyan : విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్) వేడుకలు బుధవారం ఉదయం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొన్నారు. నేవీ సిబ్బంది నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఐఎన్ఎస్ సుమేధ నౌకపై రాష్ట్రపతి ముర్ముతో పాటు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ తన సతీమణి అన్నా లెజినోవాతో కలిసి పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.





















