Vijay Rashmika : నితిన్ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాలో విజయ్ రష్మిక రిలేషన్ గురించి..

నితిన్(Nithiin), శ్రీలీల(Sreeleela) జంటగా నటించిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’(Extra Ordinary Man) సినిమా నేడు థియేటర్స్ లో రిలీజయింది.

Vijay Devarakonda Rashmika Relation Discussion in Nithin Extra Ordinary Man Movie

Vijay Rashmika : ఇటీవల విజయ్(Vijay Devarakonda), రష్మికలు(Rashmika Mandanna) మరింత వైరల్ అవుతున్నారు. వారు గతంలో స్నేహితులు అని చెప్పినా ఇద్దరి మధ్య ఏదో ఉందని రెగ్యులర్ గా వార్తలు వస్తూనే ఉన్నాయి. విజయ్ దేవరకొండ ఫోటోలు దిగిన లొకేషన్స్ లోనే రష్మిక ఫోటోలు కూడా బయటపడుతుండటంతో వీరు ఏదో దాస్తున్నారని, డేటింగ్ లో ఉన్నారని, ప్రేమలో ఉన్నారని అంతా అనుకుంటున్నారు.

ఇటీవల నాని(Nani) హాయ్ నాన్న(Hi Nanna) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఈ ఇద్దరి మాల్దీవ్స్ ఫోటోలు స్క్రీన్ మీద కనపడటంతో మరింత వైరల్ అయ్యారు. అలాగే ఇటీవల ఇద్దరూ కలిసి విజయ్ కి చెందిన రౌడీ బ్రాండ్ ఒకే రకం డ్రెస్ వేసుకొని కనిపించారు. ఇలా ఏదో ఒక రకంగా విజయ్ రష్మిక లు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు, సోషల్ మీడియాలో వీళ్ళ గురించి చర్చ సాగుతూనే ఉంది. తాజాగా ఈ జంట గురించి ఏకంగా సినిమాలోనే చర్చించారు.

నితిన్(Nithiin), శ్రీలీల(Sreeleela) జంటగా నటించిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’(Extra Ordinary Man) సినిమా నేడు థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమాలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ గా నటిస్తాడు. ఓ సన్నివేశంలో నితిన్ హీరోయిన్ ఇంటికి వెళ్లగా అక్కడ ఇంట్లో వాళ్లంతా నితిన్ ని సినిమా వాళ్ళ గురించి ప్రశ్నలు వేస్తారు. బాలకృష్ణ కొడతాడంట కదా? పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు? ఇలా రకరకాల ప్రశ్నలు అడుగుతారు. వాటికి నితిన్ సరదాగా సమాధానాలు చెప్తాడు.

Also Read : ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా రివ్యూ.. ఫుల్ ఎక్స్‌ట్రాగా నవ్వించేసిన నితిన్..

ఈ నేపథ్యంలోనే విజయ్ రష్మికల మధ్య ఏముంది అని నితిన్ ని అడుగుతారు. దీంతో నితిన్ జులాయి సినిమాలోని.. నేనెట్టకుంటే నీకేంటన్నాయి.. అని సాగే పాట పాడి ఎవరు ఏం చేస్తే మీకెందుకు అన్నట్టు ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చాడు. దీంతో విజయ్ – రష్మిక గురించి ఏకంగా సినిమాలోనే మాట్లాడటంతో మరోసారి వీళ్ళు చర్చగా మారారు.

ట్రెండింగ్ వార్తలు