Khushi : అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ చేసిన సమంత, విజయ్.. గ్రూప్ ఫొటోలతో హడావిడి..
విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా "ఖుషి" తాజాగా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కాశ్మీర్ లో ఇటీవల...........
- Saketh U
- Published On : May 23, 2022 / 12:41 PM IST
Vijay Samantha
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా “ఖుషి” తాజాగా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కాశ్మీర్ లో ఇటీవల షూటింగ్ చేసిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
గత నెల 23 తేదీ నుంచి కశ్మీర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టారు. దాదాపు నెల రోజుల భారీ షెడ్యూల్ ని చిత్రీకరించారు. ఈ షూట్ లోనే సమంత, విజయ్ బర్త్ డేలు ఒకరివి ఒకరు స్పెషల్ గా సెలబ్రేట్ చేశారు. విజయ్, సమంత మధ్య పలు సన్నివేశాలని చిత్రికరించారు. ఇక ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా ఖుషి టైటిల్ పెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తాజాగా కశ్మీర్లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా చిత్ర బృందం గ్రూప్ ఫొటో దిగారు. కశ్మీర్ షెడ్యూల్ అమోజింగ్ ఫీల్ ఇచ్చింది, విజయ్, సమంతతో పాటు యూనిట్ అందరికీ కంగ్రాంట్స్ అంటూ దర్శకుడు శివ నిర్వాణ ట్వీట్ చేశాడు.
కొంచెం గ్యాప్ తీసుకొని నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో ఆ తర్వాత వైజాగ్, కేరళ అలెప్పిలలో మిగతా షూటింగ్ చేయనున్నారు. ఈ సినిమాని డిసెంబర్ 23న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.
Amazing first schedule in kashmir
Thankyou @TheDeverakonda @Samanthaprabhu2 @vennelakishore #saranyapradeep and Whole #khushiteam ? congratulations
#khushiondec23 #khushi pic.twitter.com/jax2pkYRvS— Shiva Nirvana (@ShivaNirvana) May 23, 2022
