Kushi Movie Collections : ఖుషి ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ కెరీర్లోనే హైయెస్ట్.. సమంత స్టార్డమ్ బాగానే పనిచేసింది..
విజయ్ కెరీర్ లోనే ఖుషి సినిమా హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ ని సాధించింది. ఖుషి సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు............
- Saketh U
- Published on- September 2, 2023 / 12:21 PM IST
Vijay Devarakonda Samantha Kushi Movie First day Collections
Kushi Movie Collections : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకత్వంలో వచ్చిన లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా ఖుషి. రిలీజ్ కి ముందే విజయ్, సమంత కాంబోలో సినిమా అనగానే అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా నుంచి వచ్చిన పాటలు, ట్రైలర్ ఆడియన్స్ ని మెప్పించాయి. ఖుషి సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్ గా పాన్ ఇండియా రిలీజ్ అయింది.
ఖుషి సినిమాపై విజయ్, సమంత చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇద్దరికీ గత సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఖుషి సినిమా రిజల్ట్ కోసం ఎదురుచూశారు. ఇక ఖుషి సినిమా థియేటర్స్ లో ఆడియన్స్ ని మెప్పించి హిట్ టాక్ తెచ్చుకుంది. కొన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూలు వచ్చినా చాలా మందికి ఈ సినిమా నచ్చింది. సినిమా రిలీజ్ కి ముందే కలెక్షన్స్ కూడా భారీగా వస్తాయని అంచనా వేశారు.
విజయ్, సమంత కాంబినేషన్ అవ్వడమే సినిమాకు చాలా ప్లస్. ఈ కాంబోతోనే జనాల్ని థియేటర్ కి రప్పించారు. విజయ్ కెరీర్ లోనే ఖుషి సినిమా హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ ని సాధించింది. ఖుషి సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు 30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అంటే దాదాపు 15 కోట్ల షేర్ కలెక్షన్స్ మొదటి రోజు వసూలు చేసింది ఖుషి సినిమా. టాలీవుడ్ బాక్సాఫీస్ లెక్కల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 18 కోట్లు, ఓవర్సీస్ నుంచి 8 కోట్లు, మిగతా ఇండియా అంతా ఇంకో నాలుగు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్టు సమాచారం. ఇది విజయ్ కెరీర్ లోనే చాలా ఎక్కువ. దీంతో విజయ్ – సమంతలు ఇద్దరూ కలిసి హిట్ కొట్టేశారు.
ఈ వారం ఎలాంటి పెద్ద సినిమాలు లేకపోవడంతో కచ్చితంగా ఖుషి సినిమా 100 కోట్ల గ్రాస్ సాధిస్తుందని చిత్రయూనిట్ అభిప్రాయపడుతోంది. ఇక ఈ సినిమా 53 కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కచ్చితంగా 110 కోట్లకు పైగా గ్రాస్ అంటే దాదాపు 55 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించాలి. ఇక విజయ్ స్టార్డమ్ కి సమంత స్టార్డమ్ కూడా తోడయి ఈ కలెక్షన్స్ వచ్చాయి అని సామ్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
