Vijay Devarakonda : సమంత మాట్లాడటం మానేసింది.. 60 శాతం షూట్ అయ్యాక సమంత హెల్త్ ప్రాబ్లమ్ వల్ల సినిమా ఆగిపోయింది
ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా హైదరాబాద్ HICC కన్వెన్షన్ లో సాయంత్రం 6 గంటల నుంచి ఆడియో లాంచ్ పేరుతో ఓ మ్యూజికల్ కాన్సర్ట్ ని నిర్వహించారు ఖుషి చిత్రయూనిట్. ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ సమంత హెల్త్ ఇష్యూ గురించి మాట్లాడాడు.
- Saketh U
- Published On : August 16, 2023 / 07:48 AM IST
Vijay Devarakonda Speech in Kushi Audio Launch event
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకత్వంలో లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఖుషి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన కొన్ని పాటలు, ట్రైలర్ ఆడియన్స్ ని మెప్పించాయి. ఈ సినిమా సగం షూట్ అయ్యాక సమంతకు మయోసైటిస్ సమస్య వల్ల కొన్ని రోజులు సినిమాలకు గ్యాప్ ఇవ్వడంతో ఈ సినిమా షూట్ కూడా ఆగిపోయింది. తాజాగా ఖుషి సినిమా ఆడియో లాంచ్ పేరుతో ఓ మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారు.
ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా హైదరాబాద్ HICC కన్వెన్షన్ లో సాయంత్రం 6 గంటల నుంచి ఆడియో లాంచ్ పేరుతో ఓ మ్యూజికల్ కాన్సర్ట్ ని నిర్వహించారు ఖుషి చిత్రయూనిట్. ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ సమంత హెల్త్ ఇష్యూ గురించి మాట్లాడాడు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ డియర్ కామ్రేడ్ సినిమా అప్పుడు విన్నాను. అప్పట్నుంచి ప్రయాణం మొదలై లాస్ట్ ఇయర్ ఖుషి సినిమా ఎంతో హ్యాపీగా మొదలుపెట్టి ఫాస్ట్ గా షూట్ చేస్తున్నాం. సడెన్ గా సమంతకి హెల్త్ బాగోలేదు అని మూడు రోజులు గ్యాప్ తీసుకుంది, హాస్పిటల్స్ కి తిరిగింది. బయటకి బాగానే కనిపిస్తుండటంతో నీకు ఏం కాలేదు షూట్ కి వచ్ఛేయ్ అని నేను, శివ అన్నాం. కానీ మూడు రోజుల గ్యాప్ రెండు వారాలు అయింది. ఆ తర్వాత నెలలు అయింది. తన హెల్త్ ప్రాబ్లమ్ గురించి చెప్పింది. కొన్ని నెలలు సమంత మాతో మాట్లాడలేదు, మమ్మల్ని కలవలేదు. దాదాపు 60 శాతం షూట్ అయ్యాక సినిమా షూట్ ఆగిపోయింది. తన హెల్త్ గురించి బయటకి అందరికి చెప్తా అన్నప్పుడు వద్దు అన్నాను. కానీ ఇంత హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా మనం కష్టపడుతున్నాం, అది అందరికి తెలియాలి. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు బాధపడకుండా మోటివేట్ అవ్వాలి అని చెప్పింది. ఇప్పుడు సమంతని చూసి చాలా మంది ఇన్‌స్పైర్ అయ్యారు. ఈ సినిమా సమంత కోసమే పెద్ద హిట్ అవ్వాలి. సమంత హెల్త్ ఇప్పుడు కూడా బాగోలేదు, కానీ తను మీ అందరి కోసం, సినిమా కోసం వచ్చింది. సమంత ఫేస్ లో స్మైల్ చూడాలి అని అన్నాడు.
Vijay Devarakonda Samantha : ఖుషి ఆడియో లాంచ్.. విజయ్, సమంతలపై దారుణంగా ట్రోల్స్..
ఇక ఖుషి సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. ఖుషి సినిమా సెప్టెంబర్ 1న పాన్ ఇండియా రిలీజ్ కాబోతుంది.
