Vijay Devarakonda : నాగ్ అశ్విన్(Nag Ahwin) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా భారీగా తెరకెక్కుతున్న సినిమా కల్కి 2898AD. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ రిలీజ్ చేసిన టీజర్ చూసి కల్కి సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని భావిస్తున్నారు అంతా. ఇక ఈ సినిమాని మే 9న రిలీజ్ చేస్తారని ప్రకటించారు చిత్రయూనిట్.
కల్కి సినిమాలో దీపికా పదుకోన్, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రానా కూడా స్పెషల్ రోల్ పోషించబోతున్నట్టు ఇండైరెక్ట్ గా మూవీ యూనిట్ గతంలోనే చెప్పింది. అయితే తాజాగా మరో ముగ్గురి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. హీరో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లు కల్కి సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తారని టాక్ నడుస్తుంది.
డైరెక్టర్ నాగ్ అశ్విన్ – విజయ్ దేవరకొండ మంచి స్నేహితులు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా నుంచి వీరిద్దరూ మంచి స్నేహితులు. నాగ్ అశ్విన్ సినిమాల్లో విజయ్ దేవరకొండకి ఏదో ఒక పాత్ర ఇస్తాడు. నాగ్ డైరెక్ట్ చేసిన ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాల్లో విజయ్ దేవరకొండ నటించాడు. నిర్మాతగా చేసిన జాతి రత్నాలు సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. అలాగే ఇప్పుడు కల్కి సినిమాలో కూడా విజయ్ దేవరకొండ గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వనున్నాడని సమాచారం.
Also Read : Sreeleela : బాబోయ్.. నెలకొక సినిమా రిలీజ్ చేసిన శ్రీలీల.. నెక్స్ట్ ఏంటి మరి?
విజయ్ తో పాటు దుల్కర్ సల్మాన్ కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఉందని, అలాగే రాజమౌళి కూడా గెస్ట్ అప్పిరెస్ ఇస్తాడని టాక్ నడుస్తుంది. రాజమౌళి గతంలో సై, మజ్ను, రెయిన్ బో, బాహుబలి.. సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ప్రభాస్ కల్కి సినిమాలో కూడా రాజమౌళి కనపడనున్నట్టు సమాచారం. అయితే వీటిపై అధికారిక ప్రకటన లేదు. మరి నిజంగానే వీళ్ళు సినిమాలో ఉన్నారా? ఇంకెవరినైనా స్టార్స్ ని గెస్ట్ అప్పీరెన్స్ కింద తీసుకొస్తారా అంటే మే 9 దాకా ఎదురు చూడాల్సిందే.