Vijay Deverakonda : సొంతూరి కోసం కొండన్న మంచి మనుసు.. ఇకపై స్కాలర్ షిప్స్..
విజయ్ అక్కడి గ్రామస్థులతో మాట్లాడుతూ ఓ మంచి విషయాన్ని ప్రకటించారు. (Vijay Deverakonda)
- Saketh U
- Published On : March 2, 2026 / 08:50 PM IST
Vijay Deverakonda
Vijay Deverakonda : ఇటీవల పెళ్లితో ఒక్కటైన విజయ్ దేవరకొండ రష్మిక మందన్న నేడు కుటుంబ సభ్యులతో కలిసి విజయ్ సొంత ఊరు తుమ్మపేట లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకున్నారు. స్థానిక ప్రజలందరికీ విజయ్ కుటుంబ సభ్యులు పెళ్లి విందు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా విజయ్ అక్కడి గ్రామస్థులతో మాట్లాడుతూ ఓ మంచి విషయాన్ని ప్రకటించారు.
Also Read : Chidambaram S. Poduval : హిట్ డైరెక్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు..
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. సొంత గ్రామంలో పెళ్లి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉంది. మా జంటకు ఆశీస్సులు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మన గ్రామానికి చాలా మంచి పనులు చేయాలని ఉంది. ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ మాకు సొంత ఇళ్లు, పొలమూ ఉన్నాయి. ఇక నుంచి తరుచుగా మన గ్రామానికి వస్తాను. అచ్చంపేట డివిజన్ లో ఉన్న 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 9, 10వ తరగతి విద్యార్థులకు విజయ్ దేవరకొండ ఛారిటబుల్ ట్రస్ట్ తరుపున ఇకపై స్కాలర్ షిప్స్ అందిస్తాం అని తెలిపారు. దీంతో విజయ్ తీసుకున్న నిర్ణయానికి ఫ్యాన్స్, నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.
