Vijay Deverakonda: బుజ్జితల్లి ఇంటికి వచ్చేయ్.. చిన్నారి అభిమానికి విజయ్ సర్ ప్రైజ్
తనను పెళ్ళికి ఎందుకు పిలవలేదు అంటూ క్యూట్ వీడియో చేసిన చిన్నారిని ఇంటికి ఆహ్వానించిన విజయ్ దేవరకొండ(Vijay Deverakonda).
- V Santhosh Kumar
- Published On : March 8, 2026 / 09:02 AM IST
Vijay Deverakonda invites his little fan for lunch
- పెళ్ళికి పిలవలేదంటూ చిన్నారి క్యూట్ వీడియో
- లంచ్ కి ఆహ్వానించిన హీరో విజయ్
- ఆనందంలో పాప ఫ్యామిలీ
Vijay Deverakonda: టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ ఇటీవల పెళ్లిచేసుకున్న విషయం తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి ఫిబ్రవరి 26న ఉదయపూర్ లో ఘనంగా జరిగింది. అనంతరం హైదరాబాద్ లో గ్రాండ్ గా రెసెప్షన్ కూడా జరిగింది. అయితే, విజయ్ దేవరకొండ పెళ్లి సందర్బంగా ఓ చిన్నారి చేసిన క్యూట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Allu Arjun: 15 ఏళ్ళ బంధం.. పెళ్లిరోజున భార్యకు బెంజ్ కారు గిఫ్ట్.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆ వీడియోలో చిన్నారి మాట్లాడుతూ.. విజయ్ కి నేను కూడా ఫ్యాన్ నే కదా. నన్ను కూడా పెళ్ళికి పిలవొచ్చు కదా.. ఎందుకు పిలవలేదు. నాకు కూడా లడ్డూలు ఇవ్వొచ్చు కదా అంటూ ఎంతో క్యూట్ గా రిక్వెస్ట్ చేస్తూ వీడియో చేసింది. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది. 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి ఆ వీడియోకి. అలా ఆ వీడియో విజయ్ వద్దకు చేరింది.
ఆ వీడియో చూసిన విజయ్(Vijay Deverakonda) వెంటనే ఆ వీడేమో కింద రిప్లై ఇచ్చాడు. చిట్టితల్లి నిన్ను ఇంటికి పిలిస్తా లంచ్ కి. నీకు నచ్చిన చాక్లెట్స్, స్వీట్స్ ఏంటో నాకు చెప్పు. ఇంట్లో చేయించుకొని మంచిగా తిందాం”అంటూ రాసుకొచ్చాడు. దాంతో, విజయ్ చేసిన ఏ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఆ చిన్నారి విజయ్ ఇంటికి ఎప్పుడు వెళుతుంది అనేది చూడాలి.
