×
Ad

Vijay Deverakonda : ఈ పరిచయం ప్రత్యేకం.. విజయ్ దేవరకొండ పోస్ట్ ఆమె గురించేనా..?

విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాలో చేసిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ పరిచయం మాత్రం ప్రత్యేకం..

  • Published On : August 29, 2023 / 07:57 PM IST

Vijay Deverakonda is about his love or Kushi movie

Vijay Deverakonda : టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఏం చేసిన సోషల్ మీడియాలో వైరల్ అవ్వాల్సిందే. ఇక తన సోషల్ ప్లాట్‌ఫార్మ్‌ల్లో చేసే పోస్టులు అంతకుమించి వైరల్ అవుతుంటాయి. తాజాగా విజయ్ చేసిన ఒక పోస్ట్ అందర్నీ ఆకర్షిస్తుంది. ఆ పోస్టులో విజయ్ మరొకరి చేతిలో చెయ్యి వేసి కనిపిస్తున్నాడు. ఆ రెండో చెయ్యి అమ్మాయి చెయ్యి అని తెలుస్తుంది. ఇక ఈ పోస్టుకి విజయ్ ఒక క్యాప్షన్ కూడా పెట్టాడు. “చాలా జరిగాయి. కానీ ఇది మాత్రం ప్రత్యేకం. త్వరలో చెబుతాను” అంటూ రాసుకొచ్చాడు. ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

Naa Saami Ranga : నాగార్జున ‘నా సామిరంగ’ ఆ మలయాళ మూవీకి రీమేక్..?

ఆ రెండో చెయ్యి ఎవరిది అయ్యి ఉంటుందని నెట్టింట చర్చ జరుగుతుంది. కాగా విజయ్ ప్రేమ విషయం ఎప్పుడు వచ్చినా రష్మిక మందన్న (Rashmika Mandanna) పేరు వినబడాల్సిందే. ఇప్పుడు కూడా ఆ చెయ్యి రష్మికదే అయ్యుంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు. ఇన్నాళ్లు సీక్రెట్ గా ఉంచిన ప్రేమ విషయాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేయబోతున్నాడు అంటూ తమ అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం.. ఇది తన సినిమా ప్రమోషన్స్ లో భాగం అయ్యుంటుంది అని చెబుతున్నారు.

Anchor Suma : టాలీవుడ్ యాంకర్స్‌కి సుమ ఇంట ఓనమ్ విందు..

విజయ్ నటించిన కొత్త సినిమా ‘ఖుషి’ ఈ వీక్ రిలీజ్ కాబోతుంది. ప్రేమ, పెళ్లి నేపథ్యంతోనే ఆ మూవీ కూడా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. దీంతో విజయ్ పోస్ట్ దానికి సంబంధించిందే అయ్యుంటుందని చెబుతున్నారు. మరి విజయ్ చెప్పే ఆ విషయం ఏంటనేది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే. కాగా శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఖుషి సినిమాలో ‘సమంత’ (Samantha) హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది.