Vijay Deverakonda Kushi is highest grosser telugu film at tamilnadu
Vijay Deverakonda : టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన సినిమాలతో పాటు తన యట్టిట్యూడ్ తో యూత్ లో భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. బయట రాష్ట్రాల్లో కూడా ఈ రౌడీ బాయ్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ఇక బాలీవుడ్ లో అయితే.. ఏకంగా స్టార్ హీరోయిన్సే విజయ్ అంటే చచ్చిపోతుంటారు. కాగా విజయ్ రీసెంట్ గా ఖుషి (Kushi) సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
Ustaad Bhagat Singh : ఉస్తాద్ ఈజ్ బ్యాక్ ఇన్ యాక్షన్.. పవన్ అభిమానులకు పండగే..!
శివానిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. సమంత ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఫస్ట్ షోతోనే హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని నమోదు చేస్తూ వస్తుంది. తాజాగా ఈ చిత్రం తమిళనాడులో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుని సృష్టించింది. కోలీవుడ్ లో ఈ చిత్రం ఇప్పటివరకు రూ.7 కోట్లు వసూలను రాబట్టింది. తమిళనాడులో ఈ ఏడాది రిలీజ్ అయిన తెలుగు సినిమాల కలెక్షన్స్ లో ఇదే హైయెస్ట్.
దీంతో తమిళనాట బాక్స్ ఆఫీస్ వద్ద ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన తెలుగు చిత్రంగా ‘ఖుషి’ నిలిచింది. ఇక ఇది చూసిన టాలీవుడ్ ఆడియన్స్ విజయ్ కి తమిళనాడులో ఇంతటి ఫాలోయింగ్ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. కాగా ఈ సంవత్సరం పూర్తి కావడానికి మరో మూడు నెలలు సమయం ఉంది. ఈమధ్యలో మరే చిత్రమైన ఆ రికార్డుని బ్రేక్ చేస్తుందా..? లేదా ఈ ఏడాది ఆ రికార్డుని విజయ్ పేరు మీదనే ఉంచుతుందా..? అనేది చూడాలి. మొదటి మూడు రోజుల్లోనే 70 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ.. మొదటి వారం పూర్తి చేసుకోబోతుంది. మరి వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి కలెక్షన్స్ నమోదు చేసిందో తెలియాల్సి ఉంది.