Vijay Deverakonda : ఈ సినిమా ఆగిపోయిందని తెలుసా? విజయ్ ప్రభాస్ కంటే ముందే ఆ హీరోయిన్ ని..
2019లో డియర్ కామ్రేడ్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ..(Vijay Deverakonda)
- Saketh U
- Published on- July 21, 2026 / 08:49 PM IST
Vijay Deverakonda
Vijay Deverakonda : మలయాళ భామ, హీరోయిన్ మాళవిక మోహనన్ ఇటీవల సంక్రాంతికి ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. అయితే ఈ హీరోయిన్ ఓ ఏడేళ్ల క్రితమే తెలుగులోకి రావాల్సింది. ప్రభాస్ కంటే ముందే విజయ్ దేవరకొండ మాళవిక మోహనన్ ని తెలుగులో పరిచయం చేయాల్సింది. కానీ ఆ సినిమా ఆగిపోయింది.
2019లో డియర్ కామ్రేడ్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ, మాళవిక మోహనన్ జంటగా హీరో అనే టైటిల్ తో ఓ కొత్త సినిమాని ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో కొత్త దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో ఈ సినిమాని అనౌన్స్ చేసారు. సినిమా ఓపెనింగ్ కూడా ఘనంగా జరిగింది. కొరటాల శివ చేతుల మీదుగా ఈ సినిమా ఓపెనింగ్ జరిగింది.
Also Read : Anshu Selvamani : హాలీవుడ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రోజా కూతురు.. అన్షు సెల్వమణి ఫొటోలు..
బైక్ రేసింగ్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ హీరో సినిమాని ప్లాన్ చేసారు. అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండేని ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నారు. మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా జరిగింది. అప్పట్లోనే ఈ సినిమాకు 50 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. కానీ మొదటి షెడ్యూల్ కే ఆరు కోట్లు ఖర్చు అవ్వడం, వచ్చిన అవుట్ ఫుట్ తో నిర్మాతలు, విజయ్ సంతృప్తి సెందకపోవడం, స్క్రిప్ట్ మార్చిన తర్వాత కూడా విజయ్ సంతృప్తి చెందకపోవడంతో హీరో సినిమా ఆగిపోయింది.
దర్శకుడిని మార్చి ఆ సినిమా చేద్దామనుకున్నారు కానీ ఆ ప్రయత్నాలు కూడా ఫలించలేదు. మొత్తానికి అలా విజయ్ దేవరకొండ, మాళవిక మోహనన్ హీరో సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ అవ్వగానే ఆగిపోయింది.
