Family Star : ఆ దేశంలో రిలీజయ్యే మొట్టమొదటి తెలుగు సినిమా.. ఫ్యామిలీ స్టార్..
మన తెలుగు సినిమాలు ప్రపంచంలోని పలు దేశాల్లో రిలీజ్ అవుతుంటాయి.
- Saketh U
- Updated on- April 2, 2024 / 02:19 PM IST
Vijay Deverakonda Mrunal Thakur Family Star Creates new Record with Releasing in a Country as first telugu movie
Family Star : విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా తెరకెక్కిన సినిమా ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు నిర్మాణంలో పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మూవీ యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు.
మన తెలుగు సినిమాలు ప్రపంచంలోని పలు దేశాల్లో రిలీజ్ అవుతుంటాయి. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే.. లాంటి దేశాల్లో తెలుగు సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. అవే కాకుండా ఇంకా చాలా దేశాల్లో తెలుగు సినిమాలు రిలీజ్ చేస్తారు. గతంలో RRR సినిమా చాలా దేశాల్లో రిలీజయిన మొదటి తెలుగు సినిమాగా రికార్డ్ సృష్టించింది. తాజాగా ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా అలాంటి రికార్డ్ సెట్ చేస్తుంది.
Also Read : Mrunal Thakur : ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్‌లో.. మృణాల్ ఠాకూర్ ఎంత క్యూట్‌గా ఉందో..
ఫ్యామిలీ స్టార్ సినిమా సౌత్ అమెరికాలోని ఉరుగ్వే దేశంలో రిలీజవ్వబోతుంది. ఆ దేశంలో రిలీజయ్యే మొదటి తెలుగు సినిమాగా ఫ్యామిలీ స్టార్ రికార్డ్ సెట్ చేస్తుంది. మరి ఆ ఉరుగ్వే దేశంతో పాటు ఓవర్సీస్ లో ఫ్యామిలీ స్టార్ ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.
