VD13: సంక్రాంతిని టార్గెట్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. VD13 షూటింగ్ మొద‌లు

ఖుషి చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ ఆ వెంట‌నే త‌న కొత్త సినిమా షూటింగ్‌ను మొద‌లుపెట్టాడు. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

VD13 shoot started

VD13 shoot started : ‘ఖుషి’ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ ఆ వెంట‌నే త‌న కొత్త సినిమా షూటింగ్‌ను మొద‌లుపెట్టాడు. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. గీత గోవిందం వంటి బ్లాక్ బాస్ట‌ర్ త‌రువాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. VD13 వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతోంది. సీతా రామం చిత్రంతో ఆక‌ట్టుకున్న మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Kushi : షూటింగ్ పూర్తి.. పుల్ స్వింగ్‌లో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు.. సెల‌బ్రేష‌న్స్ చూశారా

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వాసు వర్మ ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌లో తెర‌కెక్కుతున్న 54వ సినిమా ఇది. తాజాగా చిత్ర బృందం ఆస‌క్తిక‌ర‌మైన అప్‌డేట్‌ను పంచుకుంది. ఈచిత్ర షూటింగ్ ఈ రోజు ప్రారంభ‌మైన‌ట్లు తెలియ‌జేస్తూ ఓ కొత్త పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకుంది. ‘మా #VD13 #SVC54 షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. సంక్రాంతి 2024కి సరైన ఎంటర్‌టైనర్‌గా మీకు హామీ ఇస్తున్నాము.’ అంటూ దానిపై రాసుకొచ్చింది.

Hari Hara Veera Mallu : హరిహ‌ర వీరమ‌ల్లు ఫోటో లీక్ చేసిన ప‌వ‌న్‌..! థాంక్స్ చెప్పిన నిధి అగ‌ర్వాల్‌

ఇదిలా ఉంటే.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత లు హీరో హీరోయిన్లుగా న‌టించిన ‘ఖుషి’ సినిమా షూటింగ్ ఈ రోజు పూరైన‌ట్లు చిత్ర బృందం తెలియ‌జేసింది. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ బాష‌ల్లో సెప్టెంబ‌ర్ 1న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Sitara : సితార పాప జ్యువెల్లరీ యాడ్ కోసం తీసుకున్న‌ రెమ్యునరేషన్‌తో ఏం చేసిందో తెలుసా..?

ట్రెండింగ్ వార్తలు