Vijay Deverakonda : విజయ్ దేవరకొండ.. ‘లైగర్’ కి చేసిన తప్పే మళ్ళీ చేస్తాడా?
తాజాగా విజయ్ బాలీవుడ్ వెళ్లి అక్కడ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మ్యాడ్ డాక్ ఫిల్మ్స్ ఆఫీస్ కి వెళ్లి అక్కడి నిర్మాతలను కలిశారు. (Vijay Deverakonda)
- Saketh U
- Published on- May 29, 2026 / 03:20 PM IST
Vijay Deverakonda
Vijay Deverakonda : విజయ్ దేవరకొండ.. తన మాటలతో, స్పీచ్ లతో యూత్ లో క్రేజ్ తెచ్చుకొని స్టార్ డమ్ సంపాదించినా కరెక్ట్ కమర్షియల్ హిట్ కొట్టి చాలా కాలమే అయింది. గీత గోవిందం సినిమా తర్వాత ఆ రేంజ్ కమర్షియల్ సక్సెస్ విజయ్ కి రాలేదు. ఇటీవల కింగ్డమ్ సినిమాపై అంచనాలు పెట్టుకున్నా అది కూడా ఆశించినంత ఫలితం ఇవ్వలేదు. త్వరలో విజయ్ నుంచి రాబోయే రౌడీ జనార్దన్, రణబాలి, శౌర్యువ్ దర్శకత్వంలో చేసే సినిమాలపై మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే తాజాగా విజయ్ బాలీవుడ్ వెళ్లి అక్కడ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మ్యాడ్ డాక్ ఫిల్మ్స్ ఆఫీస్ కి వెళ్లి అక్కడి నిర్మాతలను కలిశారు. దీంతో విజయ్ బాలీవుడ్ లో సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే విజయ్ తో పాటు దర్శకుడు విక్రమ్ కుమార్ కూడా కలిసి వెళ్లారు. మనం, 24, గ్యాంగ్ లీడర్.. లాంటి మంచి సినిమాలను అందించిన విక్రంకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా అనుకున్నట్టు, ఆల్రెడీ విక్రమ్ చెప్పిన కథ విజయ్ కి నచ్చినట్టు సమాచారం.
Also Read : Devi Sri Prasad : చెర్రీతో సుక్కు మూవీకి దేవిశ్రీ మ్యూజిక్..!
ఈ కథకి మ్యాడ్ డాక్ ఫిల్మ్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారని, అందుకే ఈ మీటింగ్ అని బాలీవుడ్ సమాచారం. అంతకుముందు ఈ సినిమాని యూవీ నిర్మాణ సంస్థలో అనుకున్నారు కానీ వర్కౌట్ అవ్వలేదు. పాన్ ఇండియా ప్రాజెక్టు గా ప్లాన్ చేయడానికే విజయ్ బాలీవుడ్ వెళ్లినట్టు తెలుస్తుంది.
అయితే గతంలో లైగర్ సినిమాని కూడా ముందు తెలుగు సినిమాగా, పూరి జగన్నాధ్ దర్శకత్వం, నిర్మాణంలో అనుకున్నారు. కానీ తర్వాత అది బాలీవుడ్ కి వెళ్లి కరణ్ జోహార్ చేతిలో పడటం, బాలీవుడ్ నిర్మాతలు ఎంటర్ అవ్వడం, ఆ తర్వాత స్క్రిప్ట్ లో మార్పులు జరగటం, అనన్య పాండే హీరోయిన్ కావడం జరిగాయి. వీటన్నిటితో లైగర్ సినిమాకు వచ్చిన ఫలితం అందరికి తెలిసిందే. ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఆ దెబ్బతో విజయ్ మరోసారి బాలీవుడ్ వెళ్ళడు, కావాలంటే ఆ పాన్ ఇండియా సినిమాలేవో ఇక్కడే తీస్తాడు అని అంతా అనుకున్నారు. అనుకున్నట్టే ఇక్కడ నిర్మాణ సంస్థలతోనే పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు విజయ్.
Also Read : Varanasi : ‘వారణాసి’ వాయిదా.. ప్రస్తుతానికి ఆ షెడ్యూల్ పక్కన పెట్టిన రాజమౌళి..?
కానీ ఇప్పుడు మళ్ళీ బాలీవుడ్ వెళ్లి అక్కడ మ్యాడ్ డాక్ ఫిల్మ్స్ తో మీటింగ్ పెట్టడంతో విజయ్ లైగర్ కి చేసిన తప్పు మళ్ళీ చేస్తాడా అనే చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు డైరెక్టర్ విక్రమ్ కుమార్ కాబట్టి కంటెంట్ మీద నమ్మకం ఉంది అంటున్నారు. మరి విక్రమ్ కుమార్ – విజయ్ వెళ్లి బాలీవుడ్ నిర్మాతలను ఎందుకు కలిసారో, ఏం ప్లాన్ చేసారో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేదాకా ఎదురుచూడాల్సిందే.
