Ranabaali Teaser : ‘రణబాలి’ టీజర్ వచ్చేసింది.. సింగనమల బొబ్బిలిగా విజయ్ దేవరకొండ అదరగొట్టాడుగా..
మీరు కూడా విజయ్ దేవరకొండ రణబాలి టీజర్ చూసేయండి.. (Ranabaali Teaser)
- Saketh U
- Updated on- September 9, 2026 / 04:19 PM IST
Ranabaali Teaser
Ranabaali Teaser : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా తెరకెక్కుతున్న సినిమా రణబాలి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు, మమ్మి ఫేమ్ ఆర్నాల్డ్ ఓస్లో నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు.
రణబాలి సినిమా అక్టోబర్ 16 దసరా కానుకగా రిలీజ్ కాబోతుంది. ఇందులో విజయ్ దేవరకొండ రాయలసీమ నుంచి వచ్చిన స్వతంత్ర పోరాటయోధుడిగా కనిపించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు.
ఈ టీజర్ చూస్తుంటే 1870 ల కాలంలో రాయలసీమలో కరువు, అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఆహరం కోసం ప్రజల నుంచి దోచుకోవడం, ప్రజలను చిత్రహింసలు పెట్టడం, వారిలోంచి రణబాలి అనే వ్యక్తి వచ్చి పోరాటం చేయడం.. వంటి అంశాలతో చూపించారు. టీజర్ అయితే అదిరిపోయింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ టీజర్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. మీరు కూడా విజయ్ దేవరకొండ రణబాలి టీజర్ చూసేయండి..
