×
Ad

Virosh : రిసెప్షన్ కి రావొద్దు.. పోలీస్ ఆంక్షల నేపథ్యంలో విజయ్ రష్మిక విజ్ఞప్తి..

మార్చ్ 4న విజయ్ రష్మిక రిసెప్షన్ భారీగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో జరగనుంది.(Virosh)

  • Published On : March 1, 2026 / 05:34 PM IST

Virosh

  • విజయ్ రష్మిక రిసెప్షన్
  • రిసెప్షన్ కి వస్తున్న స్టార్స్, నేతలు
  • కట్టుదిట్టమైన పోలీస్ భద్రత

Virosh : ఇటీవల ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి ఘనంగా జరిగింది. దేశ నలువైపులా నుంచి వీరికి శుభాకాంక్షలు వచ్చాయి. వీరి పెళ్లి ఫొటోలు వైరల్ అయ్యాయి. మార్చ్ 4న విజయ్ రష్మిక రిసెప్షన్ భారీగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో జరగనుంది.

విజయ్ రష్మిక రిసెప్షన్ కి టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు బాలీవుడ్ స్టార్లు, ఏపీ, తెలంగాణ రాజకీయ నేతలు, పలువురు జాతీయ నాయకులు కూడా హాజరుకానున్నారు. దీంతో ఆ హోటల్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ రష్మిక టీమ్ అభిమానులకు విజ్ఞప్తి చేస్తూ లెటర్ రిలీజ్ చేసారు.

Also Read : Peddi : డబ్బింగ్ మొదలుపెట్టిన ‘పెద్ది’.. స్పెషల్ వీడియో రిలీజ్.. నో డౌట్..

ఈ లెటర్ లో.. విజయ్ రష్మిక పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. విరోష్ పెళ్లి రిసెప్షన్ పరిమిత ఆహ్వానితులకు మాత్రమే. హైదరాబాద్ లోని ఓ హోటల్లో ఈ నెల 4న సాయంత్రం విజయ్ దేవరకొండ, రశ్మిక వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. కొద్దిమంది సన్నిహితులు, పరిమిత సంఖ్యలో గెస్ట్ లు ఈ రిసెప్షన్ లో పాల్గొననున్నారు. పలువురు సెలబ్రిటీలు, నాయకులు హాజరవుతున్న కారణంగా పోలీసులు విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు.

ఇన్విటేషన్ లేని వారు ఈ రిసెప్షన్ కార్యక్రమానికి రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పోలీస్ ల ఆంక్షల నేపథ్యంలో ఆహ్వానం లేకుండా ఇతరులు, అభిమానులు ఈ కార్యక్రమానికి రావొద్దని, వచ్చి ఇబ్బందుల పాలు కావొద్దని విరోష్ జంట కూడా కోరుతున్నారు. మీ క్షేమమే మాకు ముఖ్యమని, మీరు ఎక్కడున్నా మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Also Read : CM Revanth Reddy : విజయ్ రష్మిక రిసెప్షన్.. సీఎం రేవంత్ కు ఆహ్వానం.. బొట్టు చీర పెట్టిన సీఎం భార్య.. ఫొటోలు..

దీంతో ఆహ్వానం లేకుండా అభిమానులు లేదా ఎవరైనా సరే వీరి రిసెప్షన్ కి వెళ్తే ఇబ్బందులు పడక తప్పదు అని తెలుస్తుంది. అందుకే ముందుగానే విజయ్ రష్మిక టీమ్ ఇలా విజ్ఞప్తి చేస్తున్నారు.