Vijay Devarakonda
Vijay Devarakonda shares video : రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటిస్తున్న సినిమా ఖుషీ. శివ నిర్మాణ (Shiva Nirvana) దర్శకత్వంలో తెరకెక్కుతోంది. రొమాంటిక్ లవ్‌స్టోరీగా రూపుదిద్దుకుంటున్న ఈచిత్రానికి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్, రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది.
తాజాగా హీరో విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమాలోని ఆరాధ్య పాటలోని క్లిప్‌నే విజయ్ పోస్ట్ చేశాడు. సమంత, విజయ్‌లు నిద్రపోతుంటారు. నిద్రలో ఒకరినొకరు హత్తుకుని పడుకునే సన్నివేశాలు వారి మధ్య ఉన్న ప్రేమను తెలియజేస్తుంటుంది. సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా తన ప్రేమ ఇలాగే ఉంటుందని ఈ వీడియోకి విజయ్ క్యాప్షన్ ఇచ్చాడు.
Project K launch : ప్రాజెక్ట్ K లాంఛ్ ఈవెంట్‌కు వెళ్లని దీపికా పదుకొనే.. అసలు కారణం ఇదే..!
ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 1న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే.. ఖుషి సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా మొదలుపెట్టాడు. పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. VD13 వర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.