BB JODI : BB జోడిలోకి ఎంట్రీ ఇచ్చిన డిమాన్ పవన్, రీతూ చౌదరి.. హాట్ పర్ఫార్మెన్స్ తో మొదలుపెట్టేసారుగా.. ప్రోమో వైరల్..
మీరు కూడా రీతూ చౌదరి - డిమాన్ పవన్ హాట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ప్రోమో చూసేయండి.. (BB JODI)
Rithu Chowdary Demon Pavan
- BB జోడి సీజన్ 2 మొదలు
- రీతూ చౌదరి డిమాన్ పవన్ జంటగా ఎంట్రీ
- హాట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ప్రోమో వైరల్
BB JODI : ఇటీవలే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 పూర్తయింది. కళ్యాణ్ పడాల ఈ సీజన్ కప్ గెలుచుకున్నాడు. ఈ సీజన్ లో రీతూ చౌదరి – డిమాన్ పవన్ జంట బాగా వైరల్ అయింది. డిమాన్ పవన్ రెండో రన్నరప్ గా నిలవగా రీతూ చౌదరి చివరి వరకు వచ్చి 90 రోజుల తర్వాత ఎలిమినేట్ అయింది. హౌస్ లో వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా నడిచింది.(BB JODI)
ఇటీవల డ్యాన్స్ షో BB జోడికి డిమాన్ పవన్- రీతూ చౌదరి జంటగా వస్తారని వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ ఈ బిగ్ బాస్ జంట BB జోడి డ్యాన్స్ షోకి వచ్చారు.మొదటి పర్ఫార్మెన్స్ లోనే హాట్ సాంగ్ తో హాట్ డ్యాన్స్ తో రెచ్చిపోయి పర్ఫార్మెన్స్ చేసి వైరల్ అవుతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Also Read : Dimple Hayathi : దాసరి నారాయణ మా తాతయ్య.. మా నానమ్మ రవితేజ తల్లిగా.. డింపుల్ హయతి బ్యాక్ గ్రౌండ్ తెలుసా?
ఇక రావడంతోనే మిగతా కంటెస్టెంట్స్ తో గొడవ కూడా పెట్టుకుంది రీతూ. డ్యాన్స్ బాలేదు అన్న నయని పావనికి కౌంటర్లు ఇచ్చింది. మిగతా వాళ్లకు కూడా రీతూ గట్టిగానే సమాధానాలు ఇచ్చింది. దీంతో BB జోడిలో రీతూ చౌదరి – డిమాన్ పవన్ జంట గట్టిగానే అందరికి కాంపిటేషన్ ఇచ్చేలా ఉన్నారు.
మీరు కూడా రీతూ చౌదరి – డిమాన్ పవన్ హాట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ప్రోమో చూసేయండి..
Also Read : Baby Uha : చిరంజీవి కొడుకుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా? అబ్బాయి కాదు అమ్మాయి.. చాలా సినిమాల్లో..
