Baby Uha : చిరంజీవి కొడుకుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా? అబ్బాయి కాదు అమ్మాయి.. చాలా సినిమాల్లో..
ఈ సినిమాలో చిరంజీవి ఇద్దరు పిల్లలకు తండ్రిగా నటించాడు. ఒక పాప, ఒక బాబుకు తండ్రిగా నటించాడు చిరంజీవి.

మెగాస్టార్ చిరంజీవి తాజాగా మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో వచ్చి భారీ హిట్ సాధించారు. థియేటర్స్ లో ఈ సినిమా అదరగొడుతుంది. మెగా ఫ్యాన్స్, ఫ్యామిలీస్ మన శంకరవరప్రసాద్ గారు కోసం థియేటర్స్ కి క్యూ కట్టారు. మొదటి రోజు ఈ సినిమా ఏకంగా 84 కోట్ల గ్రాస్ వసూలు చేసి చిరంజీవి కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చింది.

ఈ సినిమాలో చిరంజీవి ఇద్దరు పిల్లలకు తండ్రిగా నటించాడు. ఒక పాప, ఒక బాబుకు తండ్రిగా నటించాడు చిరంజీవి.

చిరంజీవి కొడుకుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ చాలా బాగా నటించారు. అయితే ఆ చైల్డ్ ఆర్టిస్ట్ అబ్బాయి కాదు అమ్మాయి.

తాజాగా మన శంకరవరప్రసాద్ గారు సినిమా సక్సెస్ మీట్ లో ఈ విషయాన్ని వెల్లడించారు.

మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవి కొడుకుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు ఊహ.

ఈ చిన్నారి ఇప్పటికే చాలా సినిమాల్లో నటించింది. చాలా చిన్నగా ఉన్నప్పట్నుంచే ఊహ సినిమాల్లో నటిస్తుంది.

ఊహ ఇప్పటికే మాచర్ల నియోజకవర్గం, ఉగ్రం, సీతారామం, భగవంత్ కేసరి, అశోకవనంలో అర్జున కళ్యాణం, మహాసముద్రం, పక్కా కమర్షియల్, ఫ్యామిలీ మ్యాన్, పుష్ప,షో టైం.. ఇలా చాలా తెలుగు సినిమాల్లో నటించింది.

అలాగే చిరంజీవి నెక్స్ట్ సినిమా విశ్వంభర లో కూడా ఊహ నటిస్తుందట.

దీంతో మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవి కొడుకుగా ఒదిగిపోయిన చైల్డ్ ఆర్టిస్ట్ అమ్మాయి అని ఆశ్చర్యపోతున్నారు.

చిన్న వయసులోనే అటు చిరంజీవితో, ఇటు బాలయ్యతో చాలా మందితో నటించేసింది అని అభినందిస్తున్నారు.







