Vijay Deverakonda: విజయ్ దేవరకొండ థియేటర్లో ఫస్ట్ సినిమా లవ్ స్టోరీ!
టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ టైంలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ.
- vamsi
- Published on- September 19, 2021 / 09:54 PM IST
Avd
Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ టైంలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. సొంతంగా బిజినెస్‌లు పెట్టుకుని రాణిస్తూనే సినిమాలు చేస్తున్నారు. రౌడీ బ్రాండ్ పేరుతో టెక్స్ టైల్ బిజినెస్ స్టార్ట్ చేసి, సూపర్ బ్రాండ్‌గా మార్చుకున్నాడు విజయ్. ఇప్పుడు మల్టిఫ్లెక్స్ బిజినెస్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు విజయ్. అగ్రశ్రేణి పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్‌తో కలిసి దేవరకొండ మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు.
తన స్వస్థలమైన మహాబూబ్‌నగర్‌లో ఈ మల్టీప్లెక్స్ థియేటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు విజయ్ దేవరకొండ. మల్టీప్లెక్స్‌కు AVD సినిమాస్ అని పేరు పెట్టారు. ఈ థియేటర్లో ఫస్ట్ సినిమాగా లవ్ స్టోరీ రాబోతుంది. సెప్టెంబర్ 24వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాతో విజయ్ థియేటర్ బిజినెస్ ప్రారంభం అవుతుంది.
ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్న విజయ్.. ఈ సినిమాని ప్యాన్ ఇండియా లెవల్లో రూపోందిస్తున్నారు. లైగర్(Liger)ను ఛార్మీ, కరణ్ జోహార్లు కలిసి నిర్మిస్తుండగా.. తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదల కానుంది.
ఇది కాకుండా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు విజయ్. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ చేస్తున్న సినిమాకు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదలైంది. సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న పుష్ప సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తైన తర్వాత విజయ్‌తో ఉంటుంది.
