Vijay-Trisha : సీఎం అవ్వగానే.. త్రిషకు ఫేవర్ చేసిన విజయ్.. పర్మిషన్ గ్రాంటెడ్..
విజయ్ సీఎం అయ్యాక త్రిష నటించిన సినిమా రాబోతుంది. (Vijay Trisha)
- Saketh U
- Updated on- May 13, 2026 / 02:57 PM IST
Vijay Gives Permission To Extra Shows For Trisha Karuppu Movie
Vijay – Trisha : విజయ్ – త్రిష రిలేషన్ లో ఉన్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. త్రిష ప్రస్తుతం విజయ్ సీఎం అయిన ఆనందాన్ని ఎంజాయ్ చేస్తుంది. విజయ్ ప్రమాణ స్వీకారానికి కూడా హాజరయి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. విజయ్ సీఎం అయ్యాక త్రిష నటించిన సినిమా రాబోతుంది.
సూర్య హీరోగా నటించిన కరుప్పు సినిమా మే 14న రిలీజ్ కాబోతుంది. RJ బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. తెలుగులో ఈ సినిమా వీరభద్రుడు అనే టైటిల్ తో రాబోతుంది. అయితే ఈ సినిమాకు రిలీజ్ రోజు ఉదయం 9 గంటల షోలకు పర్మిషన్ ఇచ్చారు విజయ్. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగానే ప్రకటించింది.
Also Read : Suvikshit : క్లైమాక్స్ లో హీరో, హీరోయిన్ చనిపోతారు.. అయినా హ్యాపీ ఎండింగ్..
దీంతో విజయ్ సీఎం అవ్వగానే త్రిష సినిమానే మొదట రావడం, దానికి ఎక్స్ ట్రా షోలకు పర్మిషన్స్ ఇవ్వడం ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలో చర్చగా మారింది. గతంలో డీఎంకే ప్రభుత్వంలో బెనిఫిట్ షోలకు, ఎర్లీ మార్నింగ్ షోలకు మొదట్లో పర్మిషన్ ఇచ్చినా తర్వాత ఆపేసారు. కొన్ని సినిమాలకు మాత్రమే ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదయం 11 గంటల ఆటతోనే సినిమాలు మొదలయ్యేవి.
ఇప్పుడు విజయ్ రాగానే త్రిష, సూర్య నటించిన సినిమాకు ఉదయం 9 గంటల ఆటకు, ఎక్స్ ట్రా షోలకు పర్మిషన్ ఇవ్వడంతో తమిళ పరిశ్రమ కూడా ఆనందం వ్యక్తం చేస్తుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక సినీ పరిశ్రమకు అండగా ఉండి అడిగిన వాటికి పర్మిషన్స్ ఇస్తున్నారు. అలాగే విజయ్ కూడా సినీ నేపథ్యం కాబట్టి ఇప్పుడు పర్మిషన్స్ ఇచ్చారు కాబట్టి ఇకపై కూడా సినీ పరిశ్రమకు ఫేవర్ గా ఉంటారని తమిళ పరిశ్రమ సంతోషం వ్యక్తం చేస్తుంది.
Also Read : Vijay : విజయ్ కి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు.. ఫిట్నెస్ ట్రైనర్ కామెంట్స్..
