Jana Nayagan: విజయ్ ‘జన నాయగన్’ సీన్స్ లీక్.. రంగంలోకి సైబర్ పోలీసులు.. భగవంత్ కేసరిని అచ్చంగా దించేశారు!
విజయ్ లేటెస్ట్ మూవీ జన నాయగన్(Jana Nayagan) సినిమా నుంచి 5 నిమిషాల సీన్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.
- V Santhosh Kumar
- Updated on- April 10, 2026 / 12:55 PM IST
vijay Jana Nayagan 5 minute clip leaked on social media
- సోషల్ మీడియాలో లీకైన జన నాయగన్ 5 నిమిషాల సీన్స్
- సైబర్ పోలీసులకు ఫుర్యాదు చేసిన టీం
- లీకైన వీడియోల తొలగింపు
Jana Nayagan: ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న దళపతి విజయ్‌కు తన సినిమా విషయంలో ఊహించని షాక్ తగిలింది. ‘జన నాయగన్(Jana Nayagan)’కు సంబంధించిన కీలక సన్నివేశాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. సుమారు ఐదు నిమిషాల నిడివి గల సీన్‌తో పాటు ఒక పాట కూడా లీక్ కావడంతో చిత్ర యూనిట్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, చిత్ర బృందం వెంటనే స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పోలీసులు ఈ లీకేజీపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
*శ్రీలీలతో రాజశేఖర్ ఒప్పందం.. ఇద్దరం డాక్టర్లమే కదా.. అది అస్సలు చేయకూడదు
మరోవైపు ఈ సినిమా విడుదలకు అడుగుడుగునా అడ్డంకులు ఎదురవుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం, కోర్టు కేసులు, సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. విజయ్ కెరీర్ లోనే ఇది ఆఖరి సినిమా కావడంతో అభిమానులు దీనిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే గత మూడు నెలలుగా ఏదో ఒక వివాదం ఈ సినిమాను చుట్టుముట్టడం, ఇప్పుడు ఏకంగా సన్నివేశాలే లీక్ కావడం అటు మేకర్స్‌ను, ఇటు ఫ్యాన్స్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
అన్ని అడ్డంకులను అధిగమించి ఈ చిత్రాన్ని ఏప్రిల్ 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న తరుణంలో ఇలాంటి పైరసీ సమస్యలు తలెత్తడం కలకలం రేపుతోంది. సినిమాపై ఉన్న క్రేజ్‌ను దెబ్బతీయకుండా ఉండేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు లీక్ అయిన లింకులను తొలగించే పనిలో పడ్డారు. మరి ఈ ‘జన నాయగన్’ అడ్డంకులన్నీ దాటుకుని బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
