Rajashekar: శ్రీలీలతో రాజశేఖర్ ఒప్పందం.. ఇద్దరం డాక్టర్లమే కదా.. అది అస్సలు చేయకూడదు
సినిమా ఇండస్ట్రీలో డాక్టర్స్ రావడంపై ఆసక్తికర కామెంట్స్ చేసిన డాక్టర్ రాజశేఖర్(Rajashekar).
rajashekar interesting comments on sreeleela
- శ్రీలీలపై డాక్టర్ రాజశేఖర్ ప్రశంసలు
- షూటింగ్లో ఆ విషయాలు మాట్లాడొద్దు
- శ్రీలీలతో రాజశేఖర్ క్రేజీ డీల్!
Rajashekar: సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ తన ముక్కుసూటి తనంతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన, నేటి తరం సెన్సేషన్ హీరోయిన్ శ్రీలీల నటన, ఎనర్జీ లెవల్స్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఆమె డ్యాన్స్‌లో చూపించే వేగం, స్క్రీన్ ప్రెజెన్స్ తనను ఎంతగానో ఆశ్చర్యపరిచాయని ఆయన చెప్పుకొచ్చారు.
krithi shetty: నాకు లక్ లేదంటున్నారు.. ‘ఐరన్ లెగ్’ అంటున్నారు.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్ వైరల్
ఈ సందర్భంగా శ్రీలీలతో జరిగిన ఒక సరదా సంఘటనను రాజశేఖర్(Rajashekar) గుర్తు చేసుకున్నారు. షూటింగ్ సమయంలో తామిద్దరం కలిసినప్పుడు డాక్టరీ వృత్తి, మెడిసిన్ గురించి అస్సలు చర్చించుకోవద్దని ఒక ఒప్పందానికి వచ్చామని నవ్వుతూ తెలిపారు. తన కూతురు, సాయి పల్లవి, శ్రీలీల ఇలా పరిశ్రమలోకి ఇప్పుడు చాలా మంది డాక్టర్లు రావడం విశేషమని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్‌లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తున్న రాజశేఖర్, యువ నటీనటులతో పని చేసేందుకు ఎప్పుడూ సిద్ధమేనని ప్రకటించారు. మంచి కథ, బలమైన పాత్రలు కుదిరితే, శ్రీలీల వంటి ప్రతిభావంతులతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి తాను ఆసక్తిగా ఉన్నట్లు ఆయన హింట్ ఇచ్చారు. ఇది భవిష్యత్తులో క్రేజీ కాంబినేషన్లకు దారితీసే అవకాశం ఉంది.
