Jana Nayagan: విజయ్ సినిమాకు పైరసీ షాక్.. రిలీజ్ కాకముందే టీవీలో ‘జన నాయకన్’ ప్రసారం

విడుదలకు ముందే టీవీలో లోకల్ టీవీ ఛానెల్ లో ప్రసారం అవుతున్న విజయ్ జన నాయగన్(Jana Nayagan) మూవీ.

Vijay Jana Nayagan movie telecasting on TV even before its release.

  • విజయ్ చివరి సినిమాను అక్రమంగా టెలికాస్ట్
  • థియేటర్లోకి రాకముందే బుల్లితెరపై ప్రత్యక్షమైన ‘జన నాయకన్
  • కోయంబత్తూరులో కలకలం రేపిన పైరసీ ఉదంతం.

Jana Nayagan: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయకన్’ (Jana Nayagan). ఈ సినిమా విడుదల విషయంలో అన్నీ అడ్డంకులే ఏర్పడుతున్నాయి. సెన్సార్ కారణంగా విడుదల వాయిదా పడింది. ఇటీవల ఆన్లైన్ లో సినిమా అంతా లీక్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాను ఏకంగా టీవీలో ప్రసారం చేయడం అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇంకా థియేటర్లలో విడుదల కాని ఈ సినిమాను తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఒక స్థానికులు టెలివిజన్ ఛానల్ అక్రమంగా ప్రసారం చేశారు.

NtrNeel: తెరపైకి ఎన్టీఆర్- అలియా జోడీ.. డ్రాగన్ సినిమాలో కీ రోల్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ

ఈ అక్రమ ప్రసారంపై విజయ్ రాజకీయ పార్టీకి చెందిన ఒక సభ్యుడు వెంటనే స్పందించి కోయంబత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమా అధికారికంగా విడుదల కాకముందే ఇలా ప్రసారం చేయడం వల్ల చిత్ర యూనిట్‌కు భారీ నష్టం వాటిల్లుతుందని, దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న కోయంబత్తూరు జిల్లా పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి, ఈ అక్రమ ప్రసారానికి కారకుడైన 44 ఏళ్ల వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కాపీరైట్ చట్టాల ఉల్లంఘన కింద అతనిపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

సాధారణంగా సినిమాలు విడుదలైన తర్వాత పైరసీ వెబ్‌సైట్లలో కనిపించడం చూస్తుంటాం, కానీ ఒక సినిమా విడుదల కాకముందే టీవీలో ప్రసారం కావడం ఇదే మొదటిసారి అని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ ఘటన వెనుక ఏదైనా పెద్ద ముఠా ఉందా లేదా సాంకేతిక లోపం వల్ల ఇది జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దళపతి విజయ్ ఫ్యాన్స్ మాత్రం తమ హీరో వీడ్కోలు సినిమాను ఇలా పైరసీ చేయడంపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.