Shah Rukh Khan : బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తాజాగా ‘జవాన్’ (Jawan) సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. తమిళ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇటీవల రూ.1000 కోట్ల మార్క్ ని అందుకొని షారుఖ్ ని మరోసారి వెయ్యి కోట్ల క్లబ్ లో నిలబెట్టింది. ఇది ఇలా ఉంటే, ఈ మూవీని పలువురు సౌత్ స్టార్స్ చూసి చిత్ర యూనిట్ ని అభినందిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా తమిళ్ హీరో విజయ్ (Vijay).. షారుఖ్ ట్వీట్ కి రిప్లై ఇస్తూ ఒక ట్వీట్ చేశాడు.
RRR – Pushpa : ఆర్ఆర్ఆర్, పుష్ప చూడలేదు.. అలాంటి సినిమాలు చూసి.. బాలీవుడ్ నటుడు వైరల్ కామెంట్స్..
కొన్ని రోజులు క్రితం విజయ్ ఫ్యాన్స్ పేజీ.. షారుఖ్ ని కంగ్రాట్యులేట్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. దానికి షారుఖ్ రెస్పాండ్ అవుతూ.. ‘థాంక్యూ, నేను దళపతి నెక్స్ట్ మూవీ కోసం ఎదురు చూస్తున్నాను. ఐ లవ్ విజయ్ సార్’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కి విజయ్ రియాక్ట్ అవుతూ.. ‘లవ్ యు టు షారుఖ్ సార్. జవాన్ బ్లాక్ బస్టర్ కి కంగ్రాట్యులేషన్స్’ అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Pawan Kalyan : ఉస్తాద్ షూటింగ్లో పవన్ కళ్యాణ్.. ఫుల్ స్వింగ్లో..!
Congratulations on the blockbuster @iamsrk, @Atlee_dir and the entire #Jawan team!
Love you too @iamsrk sir https://t.co/yq5T2BOhz8
— Vijay (@actorvijay) September 27, 2023
కాగా షారుఖ్ తాజాగా ట్విట్టర్ లో #AskSRK అంటూ అభిమానులతో ఇంటరాక్షన్ సెక్షన్ నిర్వహించాడు. ఈ క్రమంలోనే కొన్ని గంటలు సేపు ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేశాడు. అయితే కొంత సమయం తరువాత బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ఎంట్రీ ఇచ్చి.. “సర్జీ బాత్ రూమ్ నుంచి బయటి రండి. లోపల ఏం చేస్తున్నారు. ట్రైలర్ చూస్తున్నారా..?” అని ఫన్నీ ట్వీట్ చేశాడు. దీనికి షారుఖ్ బదులిస్తూ.. ‘వచ్చేస్తున్నా సార్. బై బాయ్స్’ అంటూ షారుఖ్ సెషన్ ఎండ్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. షారుఖ్ అండ్ హిరానీ కాంబినేషన్ లో ఈ క్రిస్టమస్ కి ‘డంకీ’ రాబోతుంది.
Oh Sh#%. Coming sir…doston se baat kar raha tha!!! Sorry boys and girls have to rush now. Varna #Dunki se nikaal denge!!! Thanks for ur time boys and girls. See u in the theatres very very soon. Love u all. So much to do less time to talk to you….Muah. https://t.co/rpAYm2TwPu
— Shah Rukh Khan (@iamsrk) September 27, 2023