Leo : లియోకి గుమ్మడికాయ కొట్టేసిన విజయ్.. టీజర్ అండ్ సాంగ్స్‌తో ప్రమోషన్..
లియో మూవీలో విజయ్ షూటింగ్ పూర్తి. ఇక టీజర్ అండ్ సాంగ్స్ విషయానికి వస్తే..
- gum 95921
- Published on- July 10, 2023 / 07:32 PM IST
Vijay role shooting complete in Lokesh Kanagaraj Leo movie
Leo : తమిళంలో బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండో సినిమా ‘లియో’. ఇళయదళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కలయికలో 2021 లో వచ్చిన ‘మాస్టర్’ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఆ మూవీ తరువాత మళ్ళీ వారిద్దరి కలయికలో ఇప్పుడు లియో వస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో త్రిష, గౌతమ్ మీనన్, సంజయ్ దత్, అర్జున్ సర్జా, ప్రియా ఆనంద్ వంటి స్టార్ క్యాస్ట్ నటించడం ఇంకా ఎక్కువ ఆసక్తిని కలిగిస్తుంది.
CI Swarnalatha : విశాఖ సీఐ స్వర్ణలత హీరోయిన్‌గా సినిమా.. ఆమె కాదు బిగ్ బాస్ నటి అంటున్న డైరెక్టర్..
జనవరిలో షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటుంది. తాజాగా ఈ మూవీలోని విజయ్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ మాత్రం పూర్తి అయ్యిందట. త్వరలోనే డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేయనున్నాడు. ఈ నెలాఖరు లోపు మొత్తం షూటింగ్ పూర్తి అవ్వనుందట. ఆ తరువాత టీజర్ అండ్ సాంగ్స్ తో మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారట. అక్టోబర్ 19న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ ఈ సినిమాని దాదాపు 250 కోట్లతో నిర్మిస్తుంది.
ఇది ఇలా ఉంటే, ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగినట్లు తెలుస్తుంది. ఈ మూవీ శాటిలైట్, డిజిటల్ అండ్ మ్యూజిక్ రైట్స్ దాదాపు 220 కోట్లకు అమ్ముడుపోయినట్లు ఫిలిం వర్గాల్లో వినిపిస్తుంది. ఇక థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే.. తమిళ్, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో కలిపి 202 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు సమాచారం. మొత్తం మీద రిలీజ్ కి ముందే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 422 కోట్లు జరిగింది. టీజర్ రిలీజ్ కాకుండా దాదాపు డబల్ మార్జిన్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.
