రైతులపట్ల ‘మక్కల్ సెల్వన్’ మంచి మనసు

రైతు సంఘం కోసం ఒక భవనం నిర్మించి, షూటింగ్‌ పూర్తయ్యాక ఆ ఊరి ప్రజలకే ఆ భవనాన్ని అప్పగించాలని చెప్పారు ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి..

  • Publish Date - October 18, 2019 / 12:51 PM IST

రైతు సంఘం కోసం ఒక భవనం నిర్మించి, షూటింగ్‌ పూర్తయ్యాక ఆ ఊరి ప్రజలకే ఆ భవనాన్ని అప్పగించాలని చెప్పారు ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి..

విజయ్‌ సేతుపతి, శ్రుతిహాసన్‌ జంటగా, సీరియస్‌ కథలతో సమాజానికి సందేశాన్నిచ్చే సినిమాలు తీసే సీనియర్ డైరెక్టర్ ఎస్ పి జననాధన్ దర్శకత్వంలో నటిస్తున్న కొత్త చిత్రం ‘లాభం’. విజయ్ సేతుపతి ప్రొడక్షన్స్, 7సీఎస్ఎంటర్‌టైనర్‌‌మెంట్ ప్రై.లి. బ్యానర్స్ నిర్మిస్తున్నాయి. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

‘లాభం’ షూటింగ్‌ నిమిత్తం రైతు సంఘ భవనం అవసరమైంది. చిత్ర బృందం సెట్‌వేసి షూటింగ్‌ చేద్దామని సన్నాహాలు చేస్తుండగా.. సెట్‌ వద్దు, రియల్ లొకేషన్‌లోనే చిత్రీకరణ జరుపుదామని విజయ్‌ సేతుపతి చెప్పారు. అంతేకాదు, నిజంగానే రైతు సంఘం కోసం ఒక భవనం నిర్మించి, షూటింగ్‌ పూర్తయ్యాక ఆ ఊరి ప్రజలకే ఆ భవనాన్ని అప్పగించాలని చెప్పారట. దీంతో ‘లాభం’ సినిమాతో తమ ఊరికి లాభం చేకూరుతోందని ఆ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రైతు సమస్యలు ప్రధానంగా రూపొందుతున్న ఈ సినిమాలో జగపతి బాబు విలన్‌గా నటిస్తున్నాడు. కలై అరసన్, పృథ్వీ తదితరులు నటిస్తున్న ‘లాభం’ చిత్రానికి కెమెరా : రామ్‌జీ, సంగీతం : డి.ఇమాన్.

ట్రెండింగ్ వార్తలు