Maharaja Sequel: మహారాజా ఈజ్ బ్యాక్.. విజయ్ సేతుపతి సెన్సేషనల్ హిట్‌కు సీక్వెల్
'మహారాజా' సినిమా సీక్వెల్(Maharaja Sequel)పై ఆసక్తికర కామెంట్స్ చేసిన విజయ్ సేతుపతి.
- V Santhosh Kumar
- Published On : March 15, 2026 / 10:38 AM IST
Vijay Sethupathi gave clarity on Maharaja movie Sequel
- బ్లాక్ బస్టర్ మహారాజాకు సీక్వెల్
- స్వయంగా ప్రకటించిన విజయ్ సేతుపతి
- ఇప్పటికే కథ రెడీ చేసిన దర్శకుడు
Maharaja Sequel: తమిళ స్టార్ విజయ్ సేతుపతి కెరీర్‌లో 50వ చిత్రంగా వచ్చిన ‘మహారాజా’ సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాదాసీదా కథాంశంతో మొదలై, వెండితెరపై ఊహించని మలుపులతో ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టింది ఈ సినిమా. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.
కేవలం థియేటర్లలోనే కాకుండా.. ఓటీటీలో కూడా అత్యధిక వ్యూస్ సాధించి, గత ఐదేళ్లలో భారతీయ సినిమా అందించిన అత్యుత్తమ థ్రిల్లర్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ఈ సెన్సేషనల్ హిట్ సినిమా గురించిన క్రేజీ న్యూస్ ఒకటి ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ గా మారింది. అదేంటంటే, మహారాజా సినిమాకు సీక్వెల్ రాబోతుందట. దర్శకుడు నిథిలన్ సామినాథన్ ఇప్పటికే ‘మహారాజా 2(Maharaja Sequel)’ కోసం ఒక పవర్‌ఫుల్ లైన్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం.
Lavanya Tripathi: కాస్టింగ్ కౌచ్ వివాదంపై లావణ్య త్రిపాఠి రియాక్షన్.. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు?
ఈ విషయంపై స్వయంగా విజయ్ సేతుపతి ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. దర్శకుడు నిథిలన్ సామినాథన్ సీక్వెల్ కి సంబందించిన చెప్పిన కీ పాయింట్ తనకు బాగా నచ్చిందని, పూర్తిస్థాయి స్క్రిప్ట్ వినడానికి తాను కూడా ఎంతో ఆతృతగా ఉన్నానని చెప్పుకొచ్చాడు విజయ్ సేతుపతి. మొదటి భాగంలో తండ్రి కూతుళ్ల సెంటిమెంట్‌తో పాటు సాగిన మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్, రెండో భాగంలో మరిన్ని ఇంటెన్స్ ట్విస్టులతో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో, విజయ్ సేతుపతి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక మహారాజా సినిమా.. కేవలం భారత్‌లోనే కాకుండా చైనా, జపాన్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలోనూ విశేష ఆదరణ పొందింది. ఇటీవల వరుస పరాజయాలతో సతమతమవుతున్న విజయ్ సేతుపతికి, ఈ సీక్వెల్ మరో భారీ బ్లాక్‌బస్టర్‌ను అందిస్తుందని ఆయన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మహారాజా సినిమా సీక్వెల్ కి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నారు.
